నయనానందకరమైన అందంతో ఉండే నయనతారకు ప్లాస్టిక్‌ సర్జరీలు గట్రాలు అవసరమా చెప్పండి?

నయనానందకరమైన అందంతో ఉండే నయనతారకు ప్లాస్టిక్‌ సర్జరీలు గట్రాలు అవసరమా చెప్పండి? నయనతార ప్లాస్టిక్‌ సర్జరీ(plastic surgery) చేయించున్నారని ఎవరైనా అంటే ఆమెకు కోపం రాకుండా ఉంటుందా? తాను ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నట్లు గతంలో వచ్చిన వార్తలను ఆమె చాలా పద్దతిగా ఖండించారు. తన వదనాన్ని మార్చుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. 'నా కనుబొమలు అంటే నాకు చాలా ఇష్టం. వాటి ఆకారం ఎప్పుడూ మారుస్తూ ఉంటాను. ప్రతి రెడ్‌ కార్పెట్‌ ఈవెంట్లకు ముందు వాటిని మార్చుతుంటాను. వాటి కోసం ఎంతో సమయాన్ని వెచ్చిస్తాను. ఐ బ్రోస్‌ ఆకారం మారినప్పుడల్లా మొహంలో మార్పు కనిపిస్తుంది. బహుశా అందుకే నా ముఖంలో మార్పులు వచ్చాయని జనం అనుకొని ఉంటారు కానీ అందులో నిజం లేదు. మరో విషయం. డైటింగ్‌ వల్ల కూడా నా ముఖంలో మార్పులు రావచ్చు. ఒక్కోసారి బుగ్గలు వచ్చినట్లు కనిపిస్తుంటాయి. మరోసారి అవి లోపలికి వెళ్లినట్లు అనిపిస్తాయి. కావాలంటే మీరు నన్ను గిచ్చి చూడొచ్చు.. నా శరీరంలో ఎక్కడా ప్లాస్టిక్‌ ఉండదు’ అని చెప్పారు నయనతార! 2003లో మనసిక్కర అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నయనతార(Nayanthara) రెండు దశాబ్దాలుగా టాప్‌ హీరోయిన్‌గానే కొనసాగుతున్నారు. మలయాళంలోనే కాదు, తమిళ, తెలుగు, హిందీ భాషలలో కూడా నయనతార నటించారు. ప్రస్తుతం ఆమె అయిదు సినిమాల్లో నటిస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story