కమెడియన్ పృథ్వీ రాజ్ తాజాగా ఆసుపత్రిలో చేరారు.

కమెడియన్ పృథ్వీ రాజ్ తాజాగా ఆసుపత్రిలో చేరారు. బీపీ ఎక్కువ అవ్వడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చేరినట్లు తెలిసింది. ప్రస్తుతం వైద్యులు ఆయనకి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇటీవల విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లైలా సినిమా(Laila Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీరాజ్(Prudhvi Raj) చేసిన కామెంట్లు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ కారణంగా విశ్వక్ సేన్ చిత్రం లైలాని బాయ్‌కాట్(Boycott laila) చేయాలంటూ వైఎస్ జగన్(Ys Jagan) అభిమానులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో చేరిన తర్వాత పృథ్వీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు 400 మంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని.. వైసీపీ(YCP) కార్యకర్తలను దుర్భాషలాడారు. రోడ్డు సైడ్ పందులకు పుట్టారారా నో కొడుకుల్లారా అంటూ ఆయన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి.
