ప్రముఖ సీనియర్ సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌(Rajednra prasad) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

ప్రముఖ సీనియర్ సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌(Rajednra prasad) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతురు గాయత్రి(Gayatri) హఠాత్తుగా మృతి చెందారు. 38 ఏళ్ల కుమార్తె ఇలా అకస్మాత్తుగా చనిపోవడంతో రాజేంద్రప్రసాద్ కుటుంబం షాక్‌కు గురైంది. చాతీలో నొప్పి ఉందని నిన్న ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. గతంలో ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ ” నాకు పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తల్లిని కోల్పోయాను. అప్పటి నుంచి నా తల్లిని కూతురిలో చూసుకున్నాను” అని అన్నారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఆయనను విడిచి వెళ్లిపోవడంతో రాజేంద్ర ప్రసాద్ శోకసంద్రంలో మునిగిపోయారు. రాజేంద్రప్రసాద్‌కు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఆయన కూతురు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story