✕
Actress Bindhu Madhavi Golden Treat : పుత్తడి బొమ్మలా తెలుగమ్మాయి.. గ్లామర్‌తో అభిమానులకు ట్రీట్.. !
By EhatvPublished on 3 April 2023 5:58 AM GMT
బిందు మాధవి (Bindu Madhavi) ఈ పేరు వినగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే సినిమా ‘ఆవకాయ్ బిర్యానీ’ (Avakaya Biryani).. అఫ్ కోర్స్ ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2008లో ఈ సినిమాకు అనీష్ కురివెళ్ల (Anish Kuruvilla) దర్శకత్వం వహించారు. ఈ సినిమాతోనే బిందు మాధవి (Avakaya Biryani)కి మంచి గుర్తింపు ఒచ్చింది. ఆ తర్వాత 2009లో తమిళంలో ‘పొక్కిషం’ అనే సినిమా చేసింది. ఇక అదే ఇయర్లో సాయిరాం శంకర్ (Sairam Shankar) హీరోగా వచ్చిన సినిమా ‘బంపర్ ఆఫర్’ చిత్రంలో నటించింది బిందు మాధవి (Bindu Madhavi).

x
Bhindu Madhavi
-
- బిందు మాధవి (Bindu Madhavi) ఈ పేరు వినగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే సినిమా ‘ఆవకాయ్ బిర్యానీ’ (Avakaya Biryani).. అఫ్ కోర్స్ ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2008లో ఈ సినిమాకు అనీష్ కురివెళ్ల (Anish Kuruvilla) దర్శకత్వం వహించారు. ఈ సినిమాతోనే బిందు మాధవి (Avakaya Biryani)కి మంచి గుర్తింపు ఒచ్చింది. ఆ తర్వాత 2009లో తమిళంలో ‘పొక్కిషం’ అనే సినిమా చేసింది. ఇక అదే ఇయర్లో సాయిరాం శంకర్ (Sairam Shankar) హీరోగా వచ్చిన సినిమా ‘బంపర్ ఆఫర్’ చిత్రంలో నటించింది బిందు మాధవి (Bindu Madhavi).
-
- 2010లో ‘ఓం శాంతి’, ‘రామరామ కృష్ణకృష్ణ’, ‘ప్రతీరోజు’, 2011లో ‘పిల్ల జమిందార్’ వంటి చిత్రాల్లో బిందు మాధవి (Bindu Madhavi) నటించింది. ఇక ఆ సినిమా తర్వాత టాలీవుడ్ కి బైబై చేప్పేసి.. తమిళ్ ఇండస్ట్రీలోకి వెళ్లి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే బిందు మాధవి (Bindu Madhavi)ని తమిళ్ ఆడియన్స్ బాగానే రిసీవ్ చేసుకున్నారు. తెలుగు ప్రేక్షకులు ఆమెను అంతగా ఆదరించకపోయినా.. తమిళ్ ఆడియన్స్ మాత్రం అక్కున చేర్చుకున్నారు.
-
- తెలుగులో కంటే బిందు మాధవి (Bindu Madhavi) తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేసింది. సినిమాల్లోకి రాకముందు ఈ అమ్మాయి అంటే కాలేజీలో ఉన్నప్పుడే శరవణ స్టోర్స్ యాడ్స్ (saravanan ads)లో మోడల్‌గానూ నటించింది బిందు. ఆమెకు సినిమాల్లో నటించాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఆమె తల్లిదండ్రులు మొదట్లో ఆమె నిర్ణయానికి అంగీకరించలేదు. అయితే బిందు మాధవి సినిమాలు నిర్ణయం తీసుకోవడంతో ఆమె తండ్రి 8 నెలలుపాటు మాట్లాడటం మానేశాడట.
-
- మరోవైపు తల్లి కూడా అయిష్టంగానే ఉంటూ వచ్చింది. అయితే చెన్నైలో ప్రముఖ ఫొటోగ్రాఫర్ వెంకట్ రామ్ ఆమెకు ఫొటోషూట్ చేసి అల్బంగా తయారు చేసి ఇచ్చాడట. ఆమె ఇప్పటికీ ఆ గ్రాటిట్యూట్ చూపిస్తుందట. ఆమె అలా మోడలింగ్ చేస్తూ టీవీల్లో యాడ్స్ కూడా చేసింది. ఈ భామ టాటా గోల్డ్ వారి తనిష్క్ (tata gold tanishq)యాడ్లోనూ ఆమె యాక్ట్ చేసింది.
-
- అలా యాడ్స్ చేస్తున్న తరుణంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) కంటపడింది బిందు మాధవి. ఆయన నిర్మాతగా చేస్తున్న సినిమాలో అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ‘ఆవకాయ్ బిర్యానీ’ చిత్రంలో అవకాశం ఇచ్చారు ఆయన. ఆ సినిమాకు సైన్ చేసిన వెంటనే చేరన్ (Cheran) డైరెక్షన్లో వచ్చిన పొక్కిషం అనే సినిమాలోనూ సపోర్టింగ్ రోల్‌ను సంపాదించింది బిందు మాధవి. అలా టాలీవుడ్‌కి ఎంటర్ అయిన ఆమె తక్కువ కాలంలోనే తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది.
-
- ఆ తర్వాత తమిళ్లో కొన్ని సినిమాల తర్వాత బ్రేక్ ఇచ్చి వెబ్ సిరీస్ (web series)ల వైపు మొగ్గు చూపింది ఈ తెలుగమ్మాయి. బిందు మాధవి పుట్టింది చిత్తూరు జిల్లా మదనపల్లె. ఆమె తండ్రి వ్యాపార పన్నుల విభాగంలో ఉప కమిషనర్‌గా ఉండేవారట. ఉద్యోగ రీత్యా ఆయన హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి వంటి ప్రాంతాలకు మారి చివరకు చెన్నై (Chennai)లో సెటిల్ అయ్యారు, ఆమె చదువుకు కూడా అక్కడే సాగింది.
-
- 2005లో వేలూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బయో టెక్నాలజీలో బిందు మాధవి (Bindu Madhavi) డిగ్రీ పూర్తి చేసింది. ఇక 2022లో బిగ్‌బాస్ (Big boss)నాన్‌స్టాప్ సీజన్ వన్ విన్నగా ఈ తెలుగమ్మాయి నిలిచింది. అయితే గత నెలలో ఆమె నటించిన ‘యాంగర్ టేల్స్’ (Anger Tales) సిరీస్ రిలీజ్ అయింది. ఈ సిరీస్‌లో ఆమె మిడిల్‌క్లాస్ ఉమెన్‌గా నటించి మంచి మార్కులు కొట్టేసింది.
-
- ఇదిలా ఉంటే తాజాగా ఈ తెలుగమ్మాయి ఎల్లో కలర్ స్లీవ్ లెస్ డ్రెస్‌లో తన గ్లామర్‌తో మెరుపులు మెరిపించింది. ఈ గోల్డెన్ కలర్ డ్రెస్సులో బిందు మాధవి (Bindu Madhavi)ని చూసిన తన ఫ్యాన్స్ తెలుగమ్మాయి బంగారపు బొమ్మలా ఉందంటున్నారు. ఇక సోషల్ మీడియాలో మన తెలుగమ్మాయికి ఫాలోయింగ్ కూడా బాగానే ఉందండోయ్. ప్రస్తుతం ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఆమె 345 పోస్టులను తన అభిమానులతో పంచుకుంది ఈ తెలుగమ్మాయి.

Ehatv
Next Story