బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పడుకొణె(Deepika padukone) పండంటి పాపకు(baby girl) జన్మనిచ్చింది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పడుకొణె(Deepika padukone) పండంటి పాపకు(baby girl) జన్మనిచ్చింది. ముంబాయిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉదయం దీపికకు పాప పుట్టింది. ప్రస్తుతం తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. దీపికా పడుకొణె, రణవీర్‌సింగ్‌లు(Ranveer singh) తల్లిదండ్రులు కావడంతో సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా విషెస్‌ చెబుతున్నారు. రామ్ లీలా అనే సినిమాలో తొలిసారి రణవీర్‌సింగ్‌, దీపికా పడుకొణెలు కలిసి నటించారు. సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమా నిర్మాణ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. రెండు కుటుంబాలు వీరి ప్రేమకు అంగీకారం తెలపడంతో 2018లో పెళ్లి చేసుకున్నారు. రామ్‌లీలా తర్వాత బాజీరావు మస్తానీ (Bajirao Mastani) పద్మావత్ (Padmaavat) సినిమాలో వీరిద్దరు కలిసి న‌టించారు. ఈ సినిమాల‌కు కూడా సంజయ్‌ లీలా బన్సాలీనే ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం విశేషం.

Updated On
Eha Tv

Eha Tv

Next Story