దివంగత సుందరి, అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ తొలుత హిందీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు.

దివంగత సుందరి, అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ తొలుత హిందీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీపై దృష్టి సారించారు. తెలుగులో ఆమె జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. మరో స్టార్ రాంచరణ్‌తో సినిమాలు కూడాచేస్తున్నారు. తమిళంవైపు కూడా జన్వీ చూస్తున్నారు. అయితే జాన్వీ ఈ మధ్య కాలంలో ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. తన పెళ్లిపై స్పష్టత ఇచ్చారు. తనకు, తన కుటుంబానికి ఎంతో ఇష్టదైవమైన తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు జాన్వీ చెప్పుకొచ్చారు. తిరుమల పుణ్యక్షేత్రం అంటే జాన్వీకి ఎంతో ఇష్టం. గతంలో తన తల్లి శ్రీదేవి ఏడాదికి కనీసం నాలుగైదు సార్లు తిరుమల వచ్చేవారు. ఆమె మరణం తర్వాత జాన్వీ ప్రతి ఏడాదిలో శ్రీవారిని వీలైనన్ని ఎక్కువ సార్లు దర్శించుకుంటుంది. ముఖ్యంగా తన తల్లి పుట్టిన రోజు, వర్ధంతి రోజు కచ్చితంగా తిరుమలకి వెళ్లి దైవదర్శనం చేసుకుంటూ వస్తోంది. మెట్ల మార్గం ద్వారా 3550 మెట్లు ఎక్కి స్వామి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా భర్త పిల్లలతో కలిసి తిరుమలలో జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నట్లు తన మనసులోని కోరికను బయటపెట్టింది. తన పెళ్లి, జీవితం తిరుమలలో జరగాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలపడంతో స్వామివారి భక్తులు, ఫ్యాన్స్ ఆమెను మెచ్చుకుంటున్నారు.
