మహానటి(Mahanati) ఫేమ్‌ కీర్తి సురేశ్ పెళ్లి(Keerthy Suresh) ఖరారయ్యిందని సమాచారం.

మహానటి(Mahanati) ఫేమ్‌ కీర్తి సురేశ్ పెళ్లి(Keerthy Suresh) ఖరారయ్యిందని సమాచారం. తన చిరకాల మిత్రుడితో పెళ్లికి(Marriage) కీర్తి సురేశ్‌ ఒప్పుకున్నారని టాక్‌. గోవా(Goa) బీచ్‌ లోకేషన్‌లో పెళ్లి జరగబోతున్నదని, బంధుమిత్రులందరినీ పెళ్లికి ఆహ్వానించబోతున్నారని చెబుతున్నారు. నిజానికి కీర్తి సురేశ్‌ పెళ్లికి సంబంధించిన వార్తలు తరచూ వస్తుంటాయి. సంగీత దర్శకుడు అనిరుథ్‌ను(Anirudh) కీర్తి సురేశ్‌ ప్రేమించిందని, త్వరలో పెళ్లి చేసుకుంటారని అప్పట్లో కొన్ని కథనాలు వచ్చాయి. అలాగే దుబాయ్‌కి చెందిన ఓ వ్యక్తితో పెళ్లి కుదిరిందని సోషల్‌ మీడియాలో వచ్చాయి. ఇవన్నీ వదంతులేనని, ఇందులో నిజం లేదని కీర్తి సురేశ్‌ స్వయంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు వస్తున్న పెళ్లి వార్తలపై కీర్తి సురేశ్‌ ఇప్పటి వరకు రియాక్టవ్వలేదు. ఆమె కుటుంబసభ్యులు కూడా అవునని కానీ కాదని కానీ చెప్పలేదు. అయితే త్వరలోనే కీర్తి సురేశ్‌ పెళ్లిని అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story