లేడి సూపర్‌స్టార్‌ నయనతారకు(Nayanthara) కథ నచ్చాలే కానీ చటుక్కున సినిమా ఒప్పేసుకుంటుంది.

లేడి సూపర్‌స్టార్‌ నయనతారకు(Nayanthara) కథ నచ్చాలే కానీ చటుక్కున సినిమా ఒప్పేసుకుంటుంది. రెమ్యూనరేషన్‌(remunaration) కూడా పెద్ద సమస్య కాదు. చిన్న హీరోల పక్కన హీరోయిన్‌గా నటించడానికి కూడా వెనుకాడదు. నయనతారలో ఉన్న గొప్ప క్వాలిటీ ఇది! సినిమా ప్రమోషన్లకు రాదు, స్టార్‌ హీరోలను కేర్‌ చేయదని అంటారే తప్ప నయన్‌లో ఉన్న ఈ సగుణాన్ని ఎవరూ చెప్పరు. తాజాగా నయనతార ఓ సినిమాకు సైన్‌ చేసింది. ఇందులో హీరో కెవిన్‌ రాజు(Kevin Raju).. తమిళ బిగ్‌బాస్‌తో కాసింత పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాను నిర్మిస్తున్నది నయనతార భర్త విఘ్నేశ్ శివన్‌(Vignesh shivan). విష్ణు ఇడవన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇతడికి మొదటి సినిమా కావడం విశేషం. నయనతార పాత్ర ఇందులో డిఫరెంట్‌గా ఉంటుందట! కథ ప్రకారం ఈ సినిమాలో హీరో కంటే నయనతార వయసులో పెద్ద అట! చిన్నవాడైన హీరోను ప్రేమిస్తుందట! ఈ కథ ఆమెకు నచ్చే చేయడానికి ఒప్పుకుందని అంటున్నారు. తాను హీరోగా నటిస్తున్న సినిమాలో నయనతార వంటి సూపర్‌స్టార్‌ హీరోయిన్‌ కావడంతో కెవిన్‌ రాజ్‌ తెగ సంబరపడిపోతున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story