సౌతిండియా హీరోయిన్‌ పార్వతి నాయర్‌పై(Parvathy Nair) పోలీసులు కేసు(police case) పెట్టారు. పార్వతితో పాటు ఓ నిర్మాతపై కూడా కేసు నమోదయ్యింది.

సౌతిండియా హీరోయిన్‌ పార్వతి నాయర్‌పై(Parvathy Nair) పోలీసులు కేసు(police case) పెట్టారు. పార్వతితో పాటు ఓ నిర్మాతపై కూడా కేసు నమోదయ్యింది. మొత్తం అయిదుగురిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. అసలేం జరిగిందంటే... 2022 అక్టోబర్‌ 20న తన ఇంట్లో దొంగతనం(theft) జరిగిందని పార్వతి నాయర్‌ నుంగంబాక్కం పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టారు. తన దగ్గర పనిచేసే సుభాష్‌ చంద్రబోస్‌(Subhash Chandrabose) 9 లక్షల రూపాయల విలువైన రెండు వాచలు, లక్షన్నర రూపాయలు ఖరీదు చేసే ఐఫోన్‌, రెండు లక్షల రూపాయల విలువైన ల్యాప్‌ట్యాప్‌ చోరీ చేశాడని కంప్లయింట్‌లో తెలిపింది. మరోవైపు సుభాష్‌ చంద్రబోస్‌ కూడా ఈమెపై కేసు పెట్టాడు. తనను కొట్టి మానసిక క్షోభకు గురి చేసిందని, తనపై అబద్దపు దొంగతనం కేసు పెట్టిందని చెప్పాడు. తేనాంపేట పోలీస్‌స్టేషన్‌లో సుభాష్‌ చంద్రబోస్‌ ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో లేటెస్ట్‌గా సైదాపేట కోర్టులో కేసు వేశాడు. పార్వతి నాయర్‌తో పాటు మరికొందరు తనపై దాడి చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. తేనాంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోలేదని కోర్టుకు విన్నవించుకున్నాడు. ఈ కేసు విచారించిన కోర్ట్.. చర్యలు తీసుకోవాలని పోలీసులని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నటి పార్వతి నాయర్‌, నిర్మాత కొడప్పాడి రాజేశ్‌తో పాటు మరో ముగ్గురిపై తేనాంపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. పార్వతి నాయర్‌ దుబాయ్‌లో జన్మించారు. అక్కడే పెరిగారు. మలయాళ సినిమాలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తర్వాత తమిళ, కన్నడ సినిమాల్లో కూడా చేశారు. ఉత్తమ విలన్, ద గోట్ చిత్రాలతో తెలుగువారికి కూడా పరిచయమయ్యారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story