నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా(Rashmika mandanna) క్లారిటీ ఇవ్వలేదు కానీ హింట్‌ అయితే ఇచ్చేసింది.

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా(Rashmika mandanna) క్లారిటీ ఇవ్వలేదు కానీ హింట్‌ అయితే ఇచ్చేసింది. ఆమె ఎక్కడికి వెళ్లినా, ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నా పెళ్లి ఎప్పుడు?(Marriage) పెళ్లి కొడుకు(Groom) ఎవరు? అనే రెండు ప్రశ్నలను అడగకుండా ఉండలేరు. ఈ ప్రశ్నలకు రష్మిక ఎప్పుడూ జవాబులను దాటవేయలేదు. చాలా తెలివిగా, చెప్పి చెప్పనట్టుగా, మార్మికంగా జవాబులు ఇస్తూ ఉంటుంది. ఆ సమాధానాలలో ఓ చిన్న క్లూ కూడా వదిలేస్తుంటుంది. ఆమె హీరోయిన్‌గా నటించిన పుష్ప 2(Pushpa-2) సినిమా విడుదల తేదీ దగ్గరకు వచ్చేసింది. డిసెంబర్‌ 5వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌ను పెంచేశారు మేకర్స్‌. ఆదివారం చెన్నైలో ఓ ఈవెంట్‌ జరిగింది. ఇందులో కూడా రష్మికను యాంకర్లు నాలుగైదు ప్రశ్నలు వేశారు. అందులో చివరగా సినిమా ఇండస్ట్రీకి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటారా? లేకపోతే సినీ పరిశ్రమతో సంబంధం లేని అబ్బాయిని పెళ్లి చేసుకుంటారా అని అడిగారు. దానికి మీకు తెలుసుగా అంటూ నవ్వేసింది. అబ్బాయి ఎవరో క్లారిటీ వచ్చేసినట్టే కదూ! ఎందుకంటే ఆమె ఎక్కడికి వెళ్లినా అక్కడి ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో అదే లోకేషన్‌కు చెందిన ఫోటోలు మరో హీరో ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపిస్తాయి. ఈ రెండూ చక్కగా మ్యాచ్‌ అవుతాయి. సో.. ఇకపై రష్మికను అడిగే రెండు ప్రశ్నల నుంచి ఓ ప్రశ్న డిలీట్‌ చేసేయవచ్చు. ఇకపై పెళ్లి ఎప్పుడు అని అడిగితే చాలు ! పెళ్లి కొడుకు ఎవరన్నది తెలిసిపోయిందిగా!

Updated On
Eha Tv

Eha Tv

Next Story