అక్కినేని నాగచైతన్య(Akkineni naga chaithanya), ధూళిపాళ్ల శోభిత(Dulipalla shobitha) పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు కాలేదు.

అక్కినేని నాగచైతన్య(Akkineni naga chaithanya), ధూళిపాళ్ల శోభిత(Dulipalla shobitha) పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు కాలేదు. అలాగని అనుకుంటున్నాం కానీ ఇరు కుటుంబాలకు చెందిన వారు చక్కటి ముహూర్తాన్ని చూసే ఉంటారు. ఎందుకంటే పెళ్లి పెట్టుకోకుండా పెళ్లి పనులు మొదలు పెట్టరు కదా! శోభిత ఇంట్లో పెళ్లి పనులను మొదలుపెట్టేశారు. దీన్ని గోధుమరాయి లేదా పసుపు దంచే కార్యక్రమం అని అంటారు. ఈ కార్యక్రమంతోనే పెళ్లి పనులకు శ్రీకారం చుడతారు. విశాఖపట్నంలోని శోభిత ఇంట్లో ఈ వేడుకలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమం తర్వాతే పెళ్లి పత్రికలు అచ్చు వేస్తారు. పెళ్లి బట్టలు, బంగారం కొంటారు. శోభిత ఇంట్లో జరిగిందంటే ఇటు నాగార్జున ఇంట్లో కూడా ఇలాంటి వేడుక జరిగే ఉంటుంది. నాగచైతన్య, శోభిత రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఆగస్టులో వీరి నిశ్చితార్థం జరిగింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story