✕
Shweta Tiwari : 40 ఏళ్ల వయస్సులోనూ హాట్ నెస్.. సీఖో కుచ్ మమ్మీసే అంటూ నెటిజన్ సెటైర్.. !
By EhatvPublished on 12 May 2023 6:20 AM GMT

x
Shweta Tiwari films
-
- అందాల భామ శ్వేతా తివారీ (Shweta Tiwari ) తన ఫొటోషూట్లతో యూత్‌కు మతులు పోగొడుతుంది. తన స్టైల్‌తో ఏ డ్రెస్‌లో నైనా హాట్ లుక్స్‌తో చంపేయగలనని పదేపదే నిరూపిస్తోంది ఈ ఏజ్ బార్ బ్యూటీ. తాజాగా ఈ భామ తన న్యూ హాట్ లుక్స్‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి.
-
- ఈ బాలీవుడ్ బ్యూటీ ఫొటోలు ఇప్పుడు మంటలు పుట్టిస్తున్నాయి. లేటెస్ట్ ఫొటోల్లో ఆమె వైట్ టాప్‌తో ఎక్ట్రా ప్లంగింగ్ నెక్లెస్‌తో దర్శనమిచ్చింది. ఒక బ్లాక్ ఓవర్ కోట్ వేసుకుని సేమ్ కలర్ షార్ట్ స్కర్ట్‌తో మత్తెక్కించే చూపులతో కెమెరాకు పోజులు ఇచ్చింది. వీటికితోడు గోదుమరంగు నెక్లెస్, బ్రాస్లెట్తో అందాలను ఆరబోసింది ఈ బ్యూటీ.
-
- ఇక బ్లాక్ కోహలెడ్ ఐస్‌తో, లైట్ లిప్ షేడ్‌తో అందరినీ ఆకట్టుకునేలా పోజులిచ్చింది. నాలుగు పదుల వయస్సులో కూడా ఈ భామ అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గనని చెప్తోంది. ఈ ఫోటోలు చూస్తుంటే కూతురికి పోటీ ఇచ్చేలా కనిపిస్తోందని చెప్పకనే చెప్తున్నారు నెటిజన్లు. ఫొటోలు ఇన్స్టాగ్రామ్ (Instagram)లో పోస్ట్ చేసిన కాసేపట్లోనే నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.
-
- ఇక ఒక నెటిజన్ అయితే ‘కిల్డ్ ఇట్ అండ్ హౌ’ అంటూ కమెంట్ చేశారు. మరో యూజర్ అయితే హాట్ అండ్ సెక్సీ అంటూ పొగిడాడు. మరొకరైతే క్రేజీగా ఆమె కూతురు పాలక్ తివారీని ట్యాగ్ చేస్తూ.. ‘ సీఖో కుచ్ మమ్మీసే’అంటూ కమెంట్ సెక్షన్లో ఫైర్ అండ్ హార్ట్ ఎమేజీలతో నింపేశాడు.
-
- ఇక డైలీ సీరియల్ కసౌతి జిందగీ కాయ్ (Kasautii Zindagii Kay) కార్యక్రమంతో శ్వేతా తివారీ మంచి పేరు సంపాదించింది. ప్రస్తుతం జీ టీవీలో ప్రసారం అవుతున్న మై హూన్ అపరాజిత (Main Hoon Aparajita)లో నటిస్తోంది. ఇందులో తన భర్త వదిలేయబడిన మహిళ చుట్టూ కథ నడుస్తుంటుంది. కష్టతరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ అపరాజిత తన కూతుళ్ల కోసం ఆమె చేయాల్సినంత చేస్తుంది.
-
- కాగా శ్వేతా తివారీ కూతురు పాలక్ తివారీ ఇటీవల విడుదల బాలివుడ్ చిత్రం కిసీకా భాయ్ కిసికి జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan) సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక శ్వేతా తివారీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 4.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story