తమిళ నటి వనిత విజయకుమార్(Vanitha Vijayakumar) నాలుగో పెళ్లికి(Fourth marriage) సిద్ధమయ్యారు.

తమిళ నటి వనిత విజయకుమార్(Vanitha Vijayakumar) నాలుగో పెళ్లికి(Fourth marriage) సిద్ధమయ్యారు. నాలుగో పెళ్లిపై గతంలో వదంతులు వచ్చాయి. ఇప్పుడు నిజమవుతోంది. చాన్నాళ్లుగా కొరియోగ్రాఫర్‌తో సన్నిహితంగా ఉంటున్న వనిత ఇప్పుడు అతడినే పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నెల 5వ తేదీన వీరిద్దరు ఏడడుగులు నడవబోతున్నారు. ప్రముఖ నటీనటులు మంజుల-విజయ్‌కుమార్‌ పెద్ద కూతురు వనిత. 1995లో చంద్రలేఖ(Chandra lekha) సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు వనిత. తర్వాత చాలా సినిమాలలో వనిత నటించారు. 2000లో నటుడు ఆకాశ్‌ని పెళ్లి చేసుకున్నారు వనిత. ఈ దంపతులకు కొడుకు, కూతురు పుట్టారు. మనస్పర్థల కారణంగా 2005లో విడాకులు తీసుకున్నారు. 2007లో ఆనంద్ జయదర్శన్ అనే వ్యాపారవేత్తని రెండో పెళ్లి చేసుకున్నారు వనిత. వీళ్లకు ఓ కూతురు పుట్టింది. అయిదేళ్లు కాపురం చేసిన తర్వాత 2012లో జయదర్శన్‌ నుంచి కూడా విడాకులు తీసుకున్నారు వనిత. ఆ తర్వాత కొరియోగ్రాఫర్‌ రాబర్ట్‌తో సహజీవనం చేస్తున్నారనే రూమర్స్‌ వచ్చాయి కానీ 2020లో ఫోటోగ్రాఫర్‌ పీటర్‌ పాల్‌ను మూడో పెళ్లి చేసుకున్నారు. వీరి కాపురం నాలుగు నెలలు కూడా సాగలేదు. అయితే పీటర్‌ పాల్‌తో తన పెళ్లి జరగలేదని, కేవలం ఎంగేజ్‌మెంట్‌ మాత్రమే జరిగిందని వనిత చెప్పారు. ఇప్పుడు ఆ కొరియోగ్రాఫర్‌ రాబర్ట్‌నే పెళ్లి చేసుకోబోతున్నారు వనిత.

Updated On
Eha Tv

Eha Tv

Next Story