అయ్య బాబోయ్.. 'టాక్సిక్ 'లో బోల్డ్ సీన్.. మహిళా డైరెక్టర్ ఇంతా చేసిందా..!!

టాక్సిక్ (Toxic) టీజర్ చూసిన తర్వాత చాలా మంది నోటి నుంచి వచ్చిన మాట ఒక్కటే. ఫీమేల్ డైరెక్టర్ ఈ సినిమా తీశారంటే నమ్మ బుద్ధి కావడం లేదని రామగోపాల్ వర్మ సైతం (Ram Gopal Varma), ''మేల్ డైరెక్టర్ ఎవ్వరినీ ఈమెతో కంపేర్ చేయలేం, ఈ సినిమా మహిళ తీసిందంటే నమ్మలేకపోతున్నా'' అని ట్వీట్ చేశారు అసలు ఎవరి గీతూ మోహన్ దాస్? ఆమె సినిమాల్లోకి ఎలా వచ్చారు? ఇంతకుముందు ఏ సినిమాకు దర్శకత్వం వహించారు? అనేది తెలుసుకుందాం. గీతూ అసలు పేరు గాయత్రి, ఆమె తండ్రి పేరు మోహన్‌దాస్, వాళ్ళది మలయాళీ కుటుంబం, కేరళలోని కొచ్చిలో జన్మించారు. మలయాళ చిత్రసీమలోకి తొలుత నటిగా అడుగు పెట్టారు. బాలనటిగా సినిమాలు చేశారు, తర్వాత కథానాయికగా మారారు, ఇప్పుడు డైరెక్షన్ మీద దృష్టి పెట్టారు, గీతూ మోహన్‌దాస్ (Geethu Mohandas) ప్రయాణం బాలనటిగా మొదలైంది. ''ఒన్నుముట్టల్ పూజ్యం వరే'' బాలనటిగా ఆమె మొదటి సినిమా. ఆ చిత్రానికి మోహన్‌లాల్ వాయిస్ ఓవర్ అందించడంతో పాటు చివరిలో అతిథి పాత్రలో తలుక్కుమని మెరిశారు. ఆ సినిమా చేసే సమయానికి ఆమె వయసు నాలుగేళ్ళు. కుటుంబ సభ్యులు గాయత్రిని ముద్దుగా గీతూ అని పిలిచేవారు. అదే స్క్రీన్ మీద వాడేవారు, కథానాయకగాను, గీతూమోహన్‌దాస్ ప్రయాణం కూడా, మోహన్‌లాల్ లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్‌తో మొదలైంది. ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్లలో ఆవిడ ఒకరు. ఆ తర్వాత పలు సినిమాలు చేశారు. అయితే అకలేలో గీతూ మోహన్‌దాస్ నటనకు పేరు రావడమే కాదు, కేరళ స్టేట్ అవార్డు కూడా వచ్చింది. ఫ్యూచర్ ఫిలిం దర్శకరాలిగా గీతూ మోహన్‌దాస్ ప్రయాణం హిందీ సినిమా లయర్స్ డైస్ తో మొదలైంది. దానికి ముందు షార్ట్ ఫిలిం తీశారు. లయర్స్ డైస్ సినిమాకు గాను ఉత్తమ నటిగా, గీతాంజలి తాపా ఛాయాగ్రహుడిగా రాజీవ్ రవి నేషనల్ అవార్డులు అందుకున్నారు. ఆ తర్వాత మరొక సినిమా చేశారు. ఈ చిత్ర నిర్మాతలలో అనురా కశ్యప్ ఒకరు. హిందీ డైలాగులు కూడా ఆయనే రాశారు. ఆ రాజీవ్ రవి ఎవరో కాదు గీతూ మోహన్‌దాస్ భర్త. నవంబర్ 14, 2009లో వాళ్ళ వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. పెళ్లి తర్వాత నటనకు ఫుల్ స్టాప్ పెట్టారు. వివాహమైన ఐదేళ్లకు దర్శకురాలిగా మారారు. డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫీచర్ ఫిలింతో భర్తకు అవార్డు రావడం విశేషం. ఇప్పుడు టాక్సిక్‌కు సైతం ఆయనే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ (Yash) హీరోగా నటిస్తున్నారు. టీజర్ అయితే సెన్సేషనల్ క్రియేట్ చేసింది. టాక్సిక్ టీజర్‌లో అసలు ''ఆ'' సీన్ ఎలా తీశారని నేటిజన్లు ప్రశ్నిస్తున్నారు. క్రిటికల్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తొలి కమర్షియల్ ప్రాజెక్ట్ గా తెరగెక్కబోతున్న చిత్రం టాక్సిక్. భారీ అంచనాల మధ్య మార్చ్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే యష్ పుట్టిన రోజు కావడంతో, ఆయన పాత్రను రివీల్ చేస్తూ ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ ద్వారా కథ ఏంటో చెప్పలేదు కానీ, హీరో క్యారెక్టరైజేషన్ పరిచయం చేశారు. పాన్ ఇండియా భాషలైన కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్ లో కూడా ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే విన్నుత్నంగా ఇంగ్లీష్ భాషలో గ్లిమ్స్ రిలీజ్ చేయడం అభిమానులను కాస్త ఆశ్చర్యపరిచింది. ఇకపోతే ఈ సినిమాలో యష్, 'రాయ' అనే పాత్రలో నటిస్తున్నట్లు గ్లిమ్స్ ద్వారా తెలియజేశారు. ఇక ఇదంతా బాగానే ఉన్నా తాజాగా చెప్పలేని గ్లిమ్స్ లో కొన్ని సన్నివేశాలు అభిమానులను ఆశ్చర్యపరిచాయి. ఇందులో బోల్డ్ సీన్ పెట్టడంతో అసలు ఈ సినిమా మహిళా దర్శకురాలే చేసిందా అన్న సందేహం కలుగుతుందని నెటిజన్లు అంటున్నారు. రాంగోపాల్‌వర్మ కూడా ఈ మహిళా డైరెక్టర్ గ్రేట్ అన్న విధంగా రాసుకొచ్చారు. సందీప్‌రెడ్డి వంగాకు తాతలా గీతూ మోహన్‌దాస్ ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


