నటి ఐశ్వర్యారాయ్(Aishwarya rai) వ్యవహారం మరోసారి ఇంటర్నెట్‌లో దుమారం రేపింది.

నటి ఐశ్వర్యారాయ్(Aishwarya rai) వ్యవహారం మరోసారి ఇంటర్నెట్‌లో దుమారం రేపింది. లోరియల్ ప్యారిస్ ఫ్యాషన్ వీక్(Loreal paris fashion) 2024కి ముందు ప్యారిస్‌లో ఒక పబ్లిక్ ఈవెంట్‌కు హాజరైనప్పుడు ఐశ్వర్య వేలికి ఉంగరంతో ఒంటరిగా హాజరైంది. అయితే వెడ్డింగ్‌ ఉంగరం(Wedding ring) కావడంతో తమ విడాకుల రూమర్లకు ఐశ్వర్య చెక్‌ పెట్టిందని భావిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఐశ్వర్య వేలికి ఉంగరం చూసిన ఈ జంట చివరకు తమ సమస్యలను పరిష్కరించుకున్నారని చర్చించుకుంటున్నారు. అయితే మరికొందరు ఐశ్వర్య వేలికి ఉన్నది పెళ్లి ఉంగరం కాదని, పెళ్లయిన మహిళలు, ప్రధానంగా మంగళూరు వాసులు ధరించే సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ఉంగరం అని చెప్తున్నారు. ఈ గాసిప్స్‌పై ఐశ్వర్య లేదా అభిషేక్‌(Abishek bachchan) క్లారిటీ ఇచ్చేవరకు ఈ ఊహాగానాలకు తెరపడే అవకాశం లేదు. కానీ అభిషేక్‌తో కలిసి ఐశ్వర్య కనిపించి చాలా కాలమైంది. దీంతో వీరిమధ్య సంబంధంపై పుకార్లు, ఊహాగానాలకు వచ్చాయి. అనంత్-రాధిక వివాహానికి ఇతర కుటుంబసభ్యులతో కాకుండా ఐశ్వర్య, ఆమె కుమార్తె ఆరాధ్యతో రావడంతో ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని భావించారు. అధికారికంగా ఈ జంట ఎప్పుడూ చెప్పనప్పటికీ.. వీరి వ్వవహారశైలి వల్ల గాసిప్స్‌ పుట్టుకొస్తున్నాయి

Updated On
Eha Tv

Eha Tv

Next Story