'అఖండ-2 వాయిదా' విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

'అఖండ-2 వాయిదా' విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నందమూరి బాలకృష్ణ 'అఖండ 2: తాండవం' చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇది అభిమానులకు, మేకర్స్‌కు షాక్ ఇచ్చింది. నిర్మాణ సంస్థ '14 రీల్స్ ప్లస్' రామ్ & గోపి ఆచంటా డిసెంబర్ 4 అర్ధరాత్రి సోషల్ మీడియాలో అధికారిక పోస్ట్ పెట్టారు. "కొన్ని అనివార్య కారణాల వల్ల 'అఖండ 2'ను అనుకున్న తేదీకి విడుదల చేయలేకపోతున్నాం. ఇది మాకు కూడా బాధాకరం. త్వరలో సానుకూల అప్‌డేట్ ఇస్తాం" అని చెప్పారు. కొత్త డేట్ ఇంకా ప్రకటించలేదు, కానీ డిసెంబర్ చివరి లేదా 2026 జనవరిలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి, 'అఖండ 2' విడుదలపై స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. మూవీ మేకర్స్ వాళ్లకు రూ.28 కోట్లు అప్పులు తీర్చలేదు. కోర్టు ఆర్డర్ ప్రకారం, థియేటర్స్, OTT, సాటిలైట్ అన్ని ఫార్మాట్స్‌లో విడుదల ఆగిపోయింది.


