అఖండ 2 విడుదలపై నిర్మాతలు ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. వాయిదా వేస్తున్నామని త్వరలోనే కొత్త తేదీ ప్రకటిస్తామని ట్వీట్ చేశారు.

అఖండ 2 విడుదలపై నిర్మాతలు ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. వాయిదా వేస్తున్నామని త్వరలోనే కొత్త తేదీ ప్రకటిస్తామని ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా బాలయ్య అభిమానులు ఆందోళనలో పడ్డారు. అయితే వివాదం సెటిల్మెంట్ అయినప్పటికీ.. కోర్టు కేసు పరిష్కారం అధికారికంగా చేయించాల్సి ఉంటుంది..స్టే ఎత్తివేయించాల్సిన అవసరం ఉంది కాబట్టి తొందరపడకుండా కాస్త విరామం ఇచ్చి సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లుగా సమాచారం. కొందరు పంపిణీదారులు చెప్పే సమాచారాన్ని బట్టి చూస్తే.. ఈ నెల 25న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటికే పంపిణీదారులతో నిర్మాతలు చర్చించారు. తెలంగాణ ప్రాంతం(నైజాం) డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడిన తర్వాత 25న విడుదలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ 25న విడుదల అవుతే క్రిస్మస్‌తో పాటు న్యూ ఇయర్ హాలిడేస్ కలిసివస్తాయి.. ఇక సంక్రాంతి సీజన్ కూడా ప్రారంభం అవుతుంది కాబట్టి డిసెంబర్ 25 నుండి జనవరి 10 వరకు సంక్రాంతి సినిమాల విడుదల వరకు అఖండకు మార్కెట్ బిజినెస్ స్కోప్ ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో విడుదల చేస్తారని సమాచారం అందుతోంది.

Updated On
ehatv

ehatv

Next Story