మొన్న హీరో అక్కినేని నాగార్జున ఓ వ్యక్తికి క్షమాపణ చెప్పుకున్నాడు గుర్తుంది కదా! ప్రస్తుతం ఆయన కుబేర అనే సినిమాలో నటిస్తున్నాడు.

మొన్న హీరో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ఓ వ్యక్తికి క్షమాపణ చెప్పుకున్నాడు గుర్తుంది కదా! ప్రస్తుతం ఆయన కుబేర అనే సినిమా(Kubera Movie)లో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ కోసం ముంబాయి ఎయిర్‌పోర్ట్‌(Mumbai Airport) నుంచి నాగార్జున బయటకు వస్తున్నప్పుడు అనూహ్యంగా ఓ సంఘటన జరిగింది. ఎయిర్‌పోర్ట్‌లో నాగార్జునతో పాటు ధ‌నుష్(Dhanush) నడుచుకుంటూ వ‌స్తున్నప్పుడు అక్కడే షాపులో పనిచేస్తున్న ఓ అభిమాని నాగ్‌తో సెల్ఫీ తీయించుకోవాలని ఉబలాటపడ్డాడు. సెల్ఫీ అంటూ ముందుకొచ్చాడు. వయసులో పెద్ద అని కూడా చూడకుండా నాగార్జున బాడీగార్డు గట్టిగా పక్కకు తోసేశాడు. కిందపడబోయిన ఆయన తమాయించుకుని నిలబడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందరూ నాగార్జునను తిట్టడం మొదలు పెట్టారు. ఇది నాగ్‌ దృష్టికి వెళ్లడంతో ఆ వ్యక్తికి నాగ్‌ క్షమాపణలు చెప్పాడు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూస్తానని మాట ఇచ్చాడు. తాజాగా మరోసారి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన నాగార్జున అక్కడే ఉన్న తన అభిమానిని పలకరించాడు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సెల్ఫీ దిగాడు. మొన్న జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదని, మా వాళ్లే తప్పుగా ప్రవర్తించారని చెప్పాడు. నాగ్‌ను కలిసిన ఆనందంలో అతడికి బోకే కానుకగా ఇచ్చాడు అభిమాని. ఈ వీడియో చూసిన అభిమానులు అక్కడున్నది మా కింగ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.క్షమాపణలు చెప్పిన ఫ్యాన్‌ను కలిసిన నాగ్‌..

Updated On
Eha Tv

Eha Tv

Next Story