సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth), కోలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌(Lokesh kanakaraj) కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కూలీ.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth), కోలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌(Lokesh kanakaraj) కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కూలీ. సన్‌ పిక్చర్స్‌(sun pictures) బ్యానర్‌పై కళానిధి మారన్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ తలైవ రజనీకాంత్‌కు 171వ సినిమా. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్(Anirudh ravi chandran) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ నెల‌లోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యింది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో విల‌న్ వేషానికి సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రజనీకి ఎదురుపడే పాత్రలో టాలీవుడ్‌ స్టార్‌ అక్కినేని నాగార్జున(Akkineni nagaruna) నటిస్తున్నారట! దీనిపై మేకర్స్‌ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ ఫిల్మ్‌నగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నాగార్జున విలన్‌గా నటించడం ఇదేమీ మొదలు కాదు. ఇంతకు ముందు ఓ బాలీవుడ్‌ మూవలో విలన్‌గా చక్కగా నటించాడు నాగార్జున. ఈ సారి రజనీకాంత్‌ పక్కన విలన్‌గా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story