మరోసారి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్( akshay kumar ) మంచి మనసు బయట పడింది. సినిమాకు 100 కోట్లకు పైనే తీసుకుంటాడు అన్న పేరున్న అక్షయ్.. ఓ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట ఎందుకో తెలుసా...?

Akshay Kumar
మరోసారి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్( akshay kumar ) మంచి మనసు బయట పడింది. సినిమాకు 100 కోట్లకు పైనే తీసుకుంటాడు అన్న పేరున్న అక్షయ్.. ఓ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట ఎందుకో తెలుసా...?
ఎన్నో వివాదాల మధ్య విడుదలై సూపర్ హిట్ అయ్యింది అక్షయ్ కుమార్ కీలకపాత్ర పోషించిన 'ఓ మై గాడ్ 2 మూవీ ( OH MY GOD 2 ). ఘన విజయాన్ని సాధించిన ఈసినిమా...రిలీజ్ అయిన రోజు నుంచి మంచి టాక్ తెచ్చుకుని.. వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే ఓమైగాడ్ సినిమా దాదాపు 150 కోట్లు వసూలు చేసిందని మూవీ టీమ్ ప్రకటించింది.
ఇక ఈమూవీలో అక్షయ్ కుమార్ తో పాటు పంకజ్ త్రిపాఠి( pankaj tripati ), యామీ గౌతమ్( yami goutham ) లాంటి స్టార్స్ కీలక పాత్రలను పోషించారు. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సో వైరల్ అవుతోంది. ఈసినిమా కోసం అక్షయ్ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. దాంతో అసలు విషయం ఏంటో ఈసినిమా నిర్మాత వెల్లడించారు. ఇంతకీ ఆయన ఏం అన్నారంటే..?
ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన అజిత్ అంధరే( anjeeth andare ) స్పందిస్తూ... అక్షయ్ కుమార్ భారీ రెమ్యూనరేషన్ తీసుకోవడం ఏంటీ.. అసలు ఈ విషయం ఎవరు ఎవరికి చెప్పారు.. ఈ వార్తలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని ఆయన అన్నారు.. ఆయన భారీగా పారితోషికం తీసుకున్నారనే వార్తల్లో నిజం లేదని... ఈ సినిమా కోసం అక్షయ్ కుమార్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆయన చెప్పారు.
అంతే కాదు సినిమా తీసే విషయంలో.. ఇబ్బందులు వచ్చాయిని.. బడ్జెట్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటే వాటిని అక్షయ్ ఆర్థికంగా సాయం చేశారని తెలిపారు. ఈ సినిమా నిర్మాతల్లో ఆయన కూడా ఒకరని... సినిమాల్లో వచ్చిన లాభాల్లో ఆయనకు కూడా వాటా ఉంటుందని చెప్పారు. ఆయనపై అసత్య ప్రచారాలు చేయడం తప్పని అంటున్నారు.
