ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu arjun) రేంజ్‌ ఏమిటో పుష్ప -2(Pushpa-2) సినిమా ప్రీ రిలీజ్‌(Pre release) బిజినెస్‌ చెబుతోంది.

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu arjun) రేంజ్‌ ఏమిటో పుష్ప -2(Pushpa-2) సినిమా ప్రీ రిలీజ్‌(Pre release) బిజినెస్‌ చెబుతోంది. సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నిర్మించిన పుష్ప సినిమా బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప ది రూల్‌ (Pushpa 2) డిసెంబర్‌ 5వ తేదీన విడుదల అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ హక్కులు 220 కోట్ల రూపాయలకు అమ్మడుపోయాయి. తమిళనాడు హక్కులు 50 కోట్ల రూపాయలకు, కర్ణాటక హక్కులు 30 కోట్ల రూపాయలకు, కేరళ హక్కులు 20 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. హిందీ వెర్షన్‌ హక్కులు 200 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌ హక్కులు 120 ఓట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. మొత్తంగా ఈ సినిమా థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా 640 కోట్ల రూపాయలు సంపాదించింది. నాన్‌ థియేట్రికల్‌ బిజినెస్‌లో(Non theretical business) కూడా రికార్డు సృష్టించింది. ఏకంగా 420 కోట్ల రూపాయల బిజినెస్‌ చేసింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story