అల్లు అర్జున్‌(Allu arjun)-సుకుమార్‌(sukumar) కాంబినేషన్‌లో రూపొందిన పుష్ప 2(Pushpa-2) సినిమా విడుదల దగ్గరకు వచ్చేసింది.

అల్లు అర్జున్‌(Allu arjun)-సుకుమార్‌(sukumar) కాంబినేషన్‌లో రూపొందిన పుష్ప 2(Pushpa-2) సినిమా విడుదల దగ్గరకు వచ్చేసింది. మరో నాలుగు రోజుల్లో సినిమా థియేటర్లలోకి వచ్చేస్తున్నది. అప్పుడు సెన్సార్‌ టాక్‌ ఎలా ఉంది అంటూ ఆరాలు తీస్తున్నారు అభిమానులు. సెన్సార్‌ బోర్డు(Censor Board) సభ్యులలో ఎవరో ఒకరు కథ మొత్తం చెప్పినట్టు ఉన్నారు. ఆ కారణంగానే పుష్ప 2 కథ ఇది అంటూ సోషల్‌ మీడియాలో తెగ రాసేస్తున్నారు నెటిజన్లు. ఇది నిజమో కాదు తెలియదు కానీ టికెట్‌ల బుకింగ్‌ మాత్రం ఇంకా ఓపెన్‌ కాలేదు. ఓపెన్‌ అయితే మాత్రం నిమిషాల్లో టికెట్లు సేల్‌ అవ్వడం గ్యారంటీ. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సినిమా ఎంత కలెక్టు చేస్తుందన్నదే ఆసక్తిగా మారింది. ఆంధ్రలో 90 కోట్ల రూపాయలకు, నైజాంలో 100 కోట్ల రూపాయలకు, సీడెడ్ లో 30 కోట్ల రూపాయలకు పుష్ప 2 సినిమాను బయ్యర్లకు విక్రయించారు. 18 శాతం జిఎస్టీలు, థియేటర్ రెంట్లు, డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు, ఇరవై శాతం కమిషన్ అన్నీ తీసేయగా 220 కోట్ల రూపాయలు రావాల్సి వుంటుంది. అంటే దాదాపు 450 కోట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేయాల్సి వుంటుంది. అంటే బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ రేంజ్‌ కలెక్షన్లు వస్తే తప్ప ఆ ఫిగర్‌కు చేరుకోరు. ఒకటి రెండు వారాలలో వచ్చే కలెక్షన్లు కావు ఇవి. చాన్నాళ్లు థియేటర్లలో ప్రేక్షకులు నిండుగా ఉంటే తప్ప 450 కోట్ల రూపాయల రేంజ్‌కు వెళ్లలేదు. పుష్ప వన్‌కు నిర్మాతలు డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు పుష్ప 2కు రేట్లు రెట్టింపు అయ్యాయి. అంటే పుష్పతో పోలిస్తే ఈ సినిమా డబుల్‌ రేంజ్‌ హిట్‌ అవ్వాలి. అవుతుందన్న గట్టి నమ్మకంతో మేకర్స్‌ ఉన్నారు. ఆల్ ది బెస్ట్‌!

Eha Tv

Eha Tv

Next Story