అల్లు అర్జున్‌కు ‘పుష్ప 2: ది రూల్’ సినిమాకు గానూ 2024 గద్దర్ ఫిల్మ్ అవార్డులలో ఉత్తమ నటుడు అవార్డు లభించింది.

అల్లు అర్జున్‌కు ‘పుష్ప 2: ది రూల్’ సినిమాకు గానూ 2024 గద్దర్ ఫిల్మ్ అవార్డులలో ఉత్తమ నటుడు అవార్డు లభించింది. జ్యూరీ ఛైర్‌పర్సన్ జయసుధ మరియు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు(Dil Raju) మీడియా సమావేశంలో వెల్లడించారు. అల్లు అర్జున్ ఈ అవార్డు అందుకోవడం గురించి సోషల్ మీడియా ద్వారా సంతోషం వ్యక్తం చేశాడు. దీనిపై స్పందిస్తూ అల్లు అర్జున్‌ (Allu Arjun )ట్వీట్‌ చేశారు. “గద్దర్ అవార్డ్స్‌(Gaddar Film Awards)లో ఉత్తమ నటుడిగా( Best Actor) ఎంపిక కావడం గౌరవంగా ఉంది. ఈ అవార్డును ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అవార్డు రావడానికి ముఖ్యకారణం దర్శకుడు సుకుమార్‌, ప్రొడ్యూసర్లు, పుష్ట టీం, ప్రేక్షకులకు అంకితం చేస్తున్నాను. ‘పుష్ప 2’ బృందానికి కూడా కృతజ్ఞతలు” అని పేర్కొన్నాడు. తెలంగాణ ప్రభుత్వం 2024లో నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ప్రవేశపెట్టింది, ఇవి సినిమా, థియేటర్, టెలివిజన్ రంగాల్లో రాణించినవారికి.

Updated On
ehatv

ehatv

Next Story