అల్లు అర్జున్‌(Allu Arjun)-సుకుమార్‌ కాంబినేషన్‌లో రాబోతున్న పుష్ప 2(Pushpa 2) సినిమా ట్రైలర్‌ యూట్యూబ్‌లో ప్రకంపనాలు సృష్టిస్తోంది.

అల్లు అర్జున్‌(Allu Arjun)-సుకుమార్‌ కాంబినేషన్‌లో రాబోతున్న పుష్ప 2(Pushpa 2) సినిమా ట్రైలర్‌ యూట్యూబ్‌లో ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు మహేశ్‌ బాబు(Mahesh babu), ప్రభాస్‌(Prabhas) సినిమాల ట్రైలర్స్‌ వ్యూస్‌ పరంగా టాప్‌లో ఉన్నాయి. ఇప్పుడు వాటిని అల్లు అర్జున్‌ తక్కువ సమయంలోనే దాటేశాడు. సరికొత్త చరిత్ర సృష్టించాడు. తెలుగులో ఇప్పటి వరకు ట్రైలర్లలో 24 గంటలలో ఎక్కువ మంది చూసింది మహేశ్‌బాబు హీరోగా నటించిన గుంటూరు కారం(Guntur Kaaram). దీనికి 37.68 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. తర్వాతి ప్లేస్‌లో ప్రభాస్‌ హీరోగా వచ్చిన సలార్‌(Salaar) నిలిచింది. సలార్‌ సినిమా ట్రైలర్‌కు 24 గంటలలో

32.58 మిలియన్ వ్యూస్‌ వచ్చాయి. ఇప్పుడు గుంటూరు కారం, సలార్‌ సినిమాలను కేవలం 15 గంటల్లో అల్లు అర్జున్ దాటేశాడు. 'పుష్ప 2' తెలుగు వెర్షన్ ట్రైలర్ 15-16 గంటల్లోనే 42 మిలియన్ల వ్యూస్‌ను దాటేసింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story