మెగా కుటుంబం మాట అటుంచితే.. ఈమధ్య అల్లు వారి సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ఏ చిన్న వేడుక జరిగినా...అల్లు ఫ్యామిలీ అంతా సందడి చేస్తుంది. తాజాగా అల్లు రామలింగయ్య(Allu Ramalingaiah).. జయంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణ జరగ్గా..

Allu Ramalingaiah statue unveiling
మెగా కుటుంబం మాట అటుంచితే.. ఈమధ్య అల్లు వారి సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ఏ చిన్న వేడుక జరిగినా...అల్లు ఫ్యామిలీ అంతా సందడి చేస్తుంది. తాజాగా అల్లు రామలింగయ్య(Allu Ramalingaiah).. జయంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణ జరగ్గా.. ఈ వేడుకల్లో సందడి చేశారు అల్లు కుటుంబం. అయితే ఈ వేడుకల్లో బన్నీ మిస్ అయ్యారు. ఇంతకీ అల్లు అర్జున్(Allu Arjun) ఏమయ్యారు.
అల్లు కుటుంబంలో ఏచిన్న వేడుక జరిగిన ఫ్యామిలీ అంతా ఒక దగ్గరే కనిపిస్తుంటారు.ఇక అల్లూవారింటి మూల పురుషుడు అల్లు రామలింగయ్య జయంతి వచ్చిందంటే.. వారికి పండగే.. లాస్ట్ ఇయర్ అల్లు రామలింగయ్య శతజయంతిని అట్టహాసంగా జరుపుకున్న మెగా , అల్లు ఫ్యామిలీ.. ఈసారి.. అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిశ్షరించారు. తాజాగా అల్లు కాంస్య విగ్రహావిష్కరణలో కుటుంబం అంతా సందడి చేయగా.. అల్లు అర్జున్ మాత్రం మిస్ అయ్యాడు.
ఈ వేడుకల్లో ఆయన కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ ఎక్కడికెళ్లాడు.. తాత కంటే ఇంపార్టెంట్ పని ఏముంది అంటూ చర్చ మొదలైంది.అయితే బన్నీ లేకపోయినా ఆయన కొడుకు అల్లు అయాన్(Allu Ayaan) చేతుల మీదుగా అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణ జరిగింది. తన ముత్తాత గురించి మురిసిపోతూ చెప్పాడు అల్లు అయాన్. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్(Allu Arvindh), శిరీష్(Sirish) సహా కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. అయితే అల్లు అర్జున్ కనిపించకపోవడానికి కారణం ఆయన ఇండియాలో లేడు. ఈ మధ్య సతీ సమేతంగా ఫారెన్ ట్రిప్ వెళ్ళాడు బన్నీ.
గతవారం సతీమణి స్నేహ రెడ్డి(Sneha Reddy) పుట్టినరోజు ఉండడంతో.. ఆమెను తీసుకొని లండన్ ఫారెన్ వెళ్ళాడు బన్నీ. అక్కడే బర్త్ డే సెలబ్రేట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. ఇక్కడ లేడు కాబట్టే తాత విగ్రహావిష్కరణ సభలో కనిపించలేదు బన్నీ.తను అక్కడ లేకపోయినా.. తన వారసుడు అయాన్ చేత విగ్రహం ఆవిష్కరణ చేయించాడు.
