అమీషా పటేల్ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్‌గా మాట్లాడింది.

అమీషా పటేల్ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. 50 ఏళ్ల వయసులో కూడా సింగిల్‌గా ఉండటానికి, పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలు చెప్పింది. పెళ్లి తర్వాత వర్క్ చేయొద్దని కండిషన్స్ పెట్టడంతోనే పెళ్లి చేసుకోలేదని వెల్లడించారు. ఆమెకు వచ్చిన చాలా ప్రపోజల్స్‌లో ఒక్క కండిషన్ తప్ప మరొకటి లేదు. పెళ్లి తర్వాత ఫిల్మ్స్ వదిలేసి, ఇంట్లో కూర్చోవాలి. ఇందుకు అంగీకరించలేకపోయింది. "నేను అమీషా పటేల్‌గా మొదట మారాలని కోరుకున్నాను. నా జీవితంలో చాలా సేపు ఎవరో కూతురుగా గడిపాను, అడల్ట్ లైఫ్‌లో కేవలం ఎవరో భార్యగా గడపకూడదు" అని ఆమె చెప్పింది.

సినిమాల్లోకి రాకముందు ఆమెకు ఓ సీరియస్ రిలేషన్‌షిప్ ఉండేది. అది సౌత్ బాంబే ఇండస్ట్రియల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. అంతా పర్ఫెక్ట్‌గా ఉండేది, కానీ ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్తున్నప్పుడు అతను ఒప్పుకోలేదు. పబ్లిక్ లైఫ్‌లో ఉండటానికి వ్యతిరేకించాడు. చివరికి ఆమె కెరీర్‌ను ఎంచుకుని, లవ్‌ను వదులుకుంది.

ఇప్పటికీ ప్రపోజల్స్ వస్తున్నాయని ఆమె వివరించింది. 50 ఏళ్ల వయసులో కూడా వెల్-టు-డు ఫ్యామిలీల నుంచి ప్రపోజల్స్ వస్తున్నాయి. ఆమెకు ప్రపోజ్‌ చేసిన వారిలో 25 ఏళ్ల వయసు ఉన్నవారు కూడా ఉన్నారని అంటున్నారు. పెళ్లికి సిద్ధమేనా అని ప్రశ్నించగా "నెవర్ సే నెవర్" అటిట్యూడ్‌తో ఉంది. సరైన వ్యక్తి దొరికితే పెళ్లికి రెడీ. "వేర్ దేర్ ఇజ్ ద విల్, దేర్ ఇజ్ ద వే" అని చెప్పింది. 2000లో కహో నా ప్యార్ హైతో డెబ్యూ చేసి, గదర్‌తో సూపర్‌స్టార్ అయింది. 2023లో గదర్ 2తో కమ్‌బ్యాక్ చేసి బ్లాక్‌బస్టర్ ఇచ్చింది. ఇప్పుడు 50లో కూడా యాక్టివ్‌గా ఉంది.

ehatv

ehatv

Next Story