ఓ ముప్పై యేళ్ల యువ‌కుడితో దుబాయ్(Dubai) లో ఆమె తెగ ఎంజాయ్‌ చేస్తున్నది.

అమీషా పటేల్‌(amisha patel) గుర్తున్నారా? పవన్‌ కల్యాణ్‌తో(Pawan kalyan) బద్రి(Badri), ఎన్టీఆర్‌తో(NTR) నరసింహుడు, మహేశ్‌బాబుతో(Mahesh babu) నాని సినిమాల్లో చేసిన గ్లామర్‌ క్వీన్‌ ఆమె! తమిళ సినిమాల్లో నటించిన అమీషా పటేల్‌కు అప్పట్లో బోల్డంత మంది అభిమానులుండేవారు. కాకపోతే ఎక్కువ కాలం స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందలేకపోయింది. బాలీవుడ్‌ దర్శకుడు విక్రమ్‌ భట్‌తో(Vikram bhatt) ప్రేమాయణం నడిపిందని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. అవి ఒట్టి పుకార్లు కాదని, నిజమేనని తర్వాత తెలిసింది. అయిదారేళ్లపాటు ఇద్దరూ గాఢంగానే ప్రేమించుకున్నారు. తర్వాత విక్రమ్‌ భట్‌కు బ్రేకప్‌ చెప్పేసి మరో ఎన్‌ఆర్‌ఐతో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఆ ప్రేమ కథ కూడా త్వరగానే ముగిసిపోయింది. ఇప్పుడు అమీషా పటేల్ వయసు 50 ఏళ్లకు ఒకటి తక్కువ! ఇప్పటికీ ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. తాజాగా ఆమె గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ ముప్పై యేళ్ల యువ‌కుడితో దుబాయ్(Dubai) లో ఆమె తెగ ఎంజాయ్‌ చేస్తున్నది. పైగా ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ కూడా చేసింది. ఆ యువకుడి కౌగిలిలో అమీషా ఒదిగిపోతున్న ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌్ చేసింది. వీరిద్దరి మధ్యన 19 ఏళ్ల ఏజ్‌ గ్యాప్‌ ఉంది. ఆ యువకుడి వయసు 30 ఏళ్లు అయితే ఈమె వయసు 49 ఏళ్లు. అతడి పేరు నీరవ్‌ బిర్లా(Nirvaan birla). బడా వ్యాపారవేత్త . అందుకే అమిషా ప్రేమలో పడిందని కొందరు అంటున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story