సినిమాలు(Movies) చూడాలంటే డబ్బులు పెట్టాలి. అట్టర్‌ఫ్లాప్‌ సినిమాను(Flop Movie) కూడా ఎవరూ ఫ్రీగా చూపించరు. అలాంటిది సినిమాలు చూసినందుకు ఎదురుడబ్బు ఇచ్చేవారు ఉంటారా? అంటే ఉన్నారు.. ఎంచక్కా ఓ డజను సినిమాలను చూసేసి రెండు వేల డాలర్లు పట్టుకెళ్లండి అని అంటోంది ఓ అమెరికన్‌(America Company) కంపెనీ.. రెండు వేల డాలర్లంటే లక్షా 60 వేల రూపాయలండి! చూస్తూ చూస్తూ అంత పెద్ద మొత్తాన్ని వదులుకోబుద్దేస్తుందా? కాకపోతే ఉత్తినే సినిమాను చూస్తే సరిపోదు.. ఆ సినిమాలపై మన అభిప్రాయాలు(Feedback) చెప్పాలి.

సినిమాలు(Movies) చూడాలంటే డబ్బులు పెట్టాలి. అట్టర్‌ఫ్లాప్‌ సినిమాను(Flop Movie) కూడా ఎవరూ ఫ్రీగా చూపించరు. అలాంటిది సినిమాలు చూసినందుకు ఎదురుడబ్బు ఇచ్చేవారు ఉంటారా? అంటే ఉన్నారు.. ఎంచక్కా ఓ డజను సినిమాలను చూసేసి రెండు వేల డాలర్లు పట్టుకెళ్లండి అని అంటోంది ఓ అమెరికన్‌(America Company) కంపెనీ.. రెండు వేల డాలర్లంటే లక్షా 60 వేల రూపాయలండి! చూస్తూ చూస్తూ అంత పెద్ద మొత్తాన్ని వదులుకోబుద్దేస్తుందా? కాకపోతే ఉత్తినే సినిమాను చూస్తే సరిపోదు.. ఆ సినిమాలపై మన అభిప్రాయాలు(Feedback) చెప్పాలి. అమెరికాకు చెందిన బ్లూమ్‌సీబాక్స్‌(Bloomsybox) అనే సంస్థ వివిధ సంవత్సరాలలో విడుదలైన 12 క్రిస్మస్‌ సినిమాలను(Holidays Movies) చూసి అభిప్రాయాలను పంచుకోవాలని సినిమా అభిమానులను కోరుతోంది. సినిమాలను చూసే వారిని ఆ కంపెనీనే ఎంపిక చేస్తుంది. ఎంపికైనవారు బ్లూమ్‌సీబాక్స్‌ చెప్పిన క్రిస్మస్‌ సినిమాలను చూడాలి. చూసి ప్రతి సినిమా గురించి వారి అభిప్రాయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవాలి. ఎంపికైన వారికి డబ్బుతో పాటు హాట్‌ కోకా, రెండు జతల యూజీజీ సాక్స్‌లు, పీకాక్‌కు ఓ ఏడాది సబ్‌స్క్రిప్షన్, 12 నెలల ఫ్లవర్‌ సబ్‌స్క్రిప్షన్‌ను కంపెనీ అందిస్తుంది. చూడాల్సిన 12 సినిమాలు ఏమిటంటే 2008లో వచ్చిన ది మోస్ట్‌ వండర్‌ఫుల్‌ టైమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌, 2014లో వచ్చిన ది నైన్‌ లైవ్స్‌ ఆఫ్‌ క్రిస్మస్‌, క్రిస్మస్‌ అండర్‌రాప్స్‌, ఏ రాయల్‌ క్రిస్మస్‌, నార్త్‌పోల్‌, 2015లో విడుదలైన క్రౌన్‌ ఫర్‌ క్రిస్మస్‌, ఫ్యామిలీ ఫర్‌ క్రిస్మస్‌, 2016లో వచ్చిన జర్నీ బ్యాక్‌ టు క్రిస్మస్‌, 2017లో విడుదలైన క్రిస్మస్‌ గేట్‌వే, ది క్రిస్మస్‌ ట్రైన్‌, 2022లో వచ్చిన గోస్ట్స్‌ ఆఫ్‌ క్రిస్మస్‌ ఆల్వేస్‌, త్రీ వైస్‌మెన్‌ అండ్‌ ఏ బేబీ.

Updated On 17 Nov 2023 1:36 AM GMT
Ehatv

Ehatv

Next Story