కాన్యె వెస్ట్(Kanye West).. అమెరికా ర్యాపర్‌(Rapper) వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లోనే ఉంటుంటాడు. లక్షలాది మంది అభిమానులు ఉన్నప్పటికీ అప్పుడప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన పరపతిని పోగొట్టుకుంటుంటాడు. ఓ హిట్లర్‌ను(Hitler) పొగుడుతాడు, ఓ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొంటానంటాడు. మరోసారి తన భార్య వద్దంటే కూతురుకు జన్మనిచ్చిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతుంటాడు.

తన దుస్తులు, షూస్‌ గురించి ఎప్పటికప్పడు సామాజిక మాధ్యమాల్లో(Social media) షేర్‌ చేస్తూ తన ఫ్యాన్స్‌ అభిప్రాయం చెప్పాలని కోరుతుంటాడు. తాజాగా మరోసారి వార్తల్లోకెక్కాడు కాన్యె వెస్ట్. ఈసారి తన పళ్ల స్థానంలో టైటానియం(Titanium Teeth) పళ్లను అమర్చుకున్నాడు. ఇందుకోసం అతను ప్రోస్టోడాంటిక్స్ ఆపరేషన్( Prosthodontics operation) చేయించుకున్నాడు. అయితే ఆ దంతాల ఖర్చు $8,50,00 అంటే భారతీయ కరెన్సీ ప్రకారం అక్షరాల ఏడు కోట్ల రూపాయలన్నమాట. తన దంతాలకు అమర్చిన టైటానియం ప్లేట్‌ను ఇన్‌స్టాలో(Instagram) షేర్‌ చేశాడు. అంతేకాకుండా జేమ్స్‌ చిత్రంలో విలన్ పాత్ర పోసించిన జాస్‌ చిత్రాలను కూడా షేర్‌ చేశాడు. సోషల్‌ మీడియాలో ఇవి వైరల్‌ కావడంతో కాన్యె వెస్ట్‌ పళ్లపై నెటిజన్లు పలు రకాలుగా ట్రోల్‌ చేస్తున్నారు.

Updated On 19 Jan 2024 1:49 AM GMT
Ehatv

Ehatv

Next Story