పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు.. పోనీ వాతలు పెట్టుకున్నా పులి అయిపోదు! అసహ్యంగా ఉంటుంది... అట్టాగే ఫలానా వారిలా ఉండాలన్న కోరికతో రూపు రేఖలు మార్చుకోకూడదు.. అసహ్యం మాట దేవుడెరుగు! ప్రాణాలు కూడా పోవచ్చు. మొన్నామధ్య పాప్ సింగర్ జిమిన్(Pop Singer Jimin)లా కనిపించాలని 12 సార్లు సర్జరీ చేయించుకున్న సెయింట్ వాన్ చనిపోయాడు కదా!

Christina Ashten Gourkani Death
పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు.. పోనీ వాతలు పెట్టుకున్నా పులి అయిపోదు! అసహ్యంగా ఉంటుంది... అట్టాగే ఫలానా వారిలా ఉండాలన్న కోరికతో రూపు రేఖలు మార్చుకోకూడదు.. అసహ్యం మాట దేవుడెరుగు! ప్రాణాలు కూడా పోవచ్చు. మొన్నామధ్య పాప్ సింగర్ జిమిన్(Pop Singer Jimin)లా కనిపించాలని 12 సార్లు సర్జరీ చేయించుకున్న సెయింట్ వాన్ చనిపోయాడు కదా! సేమ్ అలాగే అమెరికన్ స్టార్ కిమ్ కర్దాషియన్(Kim Kardashian)లా కనిపించడానికి సర్జరీ చేయించుకున్న ఓ మోడల్ గుండెపోటుతో చనిపోయింది.
క్రిస్టినా అస్తెన్ గౌర్కానీ(Christina Ashten Gourkani )అనే 34 ఏళ్ల మోడల్ ఆల్ ఆఫ్ సడన్ కిమ్ కర్దాషియన్‌లా మారిపోవాలనుకుంది. అనుకున్నదే ఆలస్యం పలు సర్జరీలు చేసుకుంది. అచ్చంగా కిమ్ కర్దాషియన్‌లా కాకపోయినా అటు ఇటుగా ఆమెలా తయారయ్యింది. ఆమె మాత్రం అందరూ తనను కర్దాషియన్‌కు ఫోటోకాపీలా ఉన్నావని పొగిడేవారని చెప్పుకుని మురిసిపోయింది. లెటెస్ట్‌గా ఆమె మరో సర్జరీ చేయించుకుంది. ఇప్పుడది వికటించింది. దాంతో గుండె కొట్టుకోవడం మందగించింది. ఫలితంగా ఈ నెల 20న గుండెపోటుతో మరణించింది. ఆమె మరణవార్తను క్రిస్టినా కుటుంబం ఇప్పుడు వెల్లడించింది. ఆమె చేయించుకున్న సర్జరీలే ఆమె ప్రాణాలను బలి తీసుకున్నాయని క్రిస్టినా కుటుంబసభ్యులు కన్నీటిని దిగమింగుకుంటూ చెప్పారు.
