అనసూయ భరద్వాజ్.. రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకు ముద్దుగుమ్మను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అనసూయ భరద్వాజ్.. రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకు ముద్దుగుమ్మను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించి. యాంకర్‌గా మారి, సినిమాల్లోనూ నటిస్తూ అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రముఖ ఛానెల్‌లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ షో ద్వారా అనసూయ బాగా పేరు పొందారు. ఆమె తన మాటలతో, అందంతో ప్రేక్షకులను అలరించారు. సినిమాల్లోనూ అవకాశాలు అందుకొని ప్రేక్షకులను మెప్పిస్తున్నారు అనసూయ. అయితే సోషల్ మీడియాలో అనసూయకు మంచి ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉంది. ఆమె గ్లామరస్ ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. అలాగే తనపై వచ్చే నెగిటివ్ ట్రోల్స్‌పై కూడా అనసూయ ఘాటుగా స్పందిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మందికి గట్టిగా కౌంటర్లు కూడా ఇస్తుంటారు అనసూయ. ఇదిలా ఉంటే తాజాగా అనసూయ ట్విట్టర్ వేదికగా మరోసారి ఓ ట్వీట్ చేసింది.'దూరపు కొండలు నునుపు' అంటూ ఆమె చేసిన మూడు పదాల ట్వీట్ వెనుక చాలా అర్థాలే ఉన్నాయంటున్నారు నెటిజన్లు. దూరపు కొండలు నునుపు అంటే సినిమా ఇండస్ట్రీ గురించే ఆమె మాట్లాడిందా అనే కోణంలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకు చేసిందో, ఏ ఉద్దేశంతో చేసిందో కాని ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
