ప్రభుదేవా(Prabhudeva), రాయ్ లక్ష్మి(Lakshmi Rai), అనసూయ భరద్వాజ్(Anasuya Bhardwaj) ప్రధాన పాత్రలలో నటించిన సినిమా వూల్ఫ్(Wolf). వినూ వెంకటేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సందేశ్ నాగరాజు, సందేశ్ ఎన్ నిర్మిస్తున్నారు. సహ నిర్మాతగా బృందా జయరామ్ వ్యవహరించారు. ప్రభుదేవ కెరీర్‌లో 60వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను గురువారం విడుదల చేశారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషలలో సినిమాను రూపొందిస్తున్నారు.

Anasuya As A Wizard Role

వూల్ఫ్ టీజర్ అందరిని ఆకట్టుకుంది. ఆ టీజర్ నిజంగానే సరికొత్త ప్రపంచానికి తీసుకెళ్లింది. అనసూయ భరద్వాజ్, ప్రభు దేవాలు కొత్తగా కనిపించారు. 69 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. ప్రభుదేవా యాక్షన్ సీక్వెన్స్‌లు, అనసూయ గెటప్ ఈ సినిమా మీద మరింతగా ఆసక్తిని పెంచేస్తున్నాయి. అనసూయ గెటప్ చూస్తే మాత్రం ఆమె తాంత్రికురాలిలా కనిపిస్తోంది. అనుసూయ లుక్ జనాలను భయపెట్టేలా ఉందంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. వశిష్ట ఎన్ సింహా, అంజు కురియన్, రమేష్ తిలక్, లొల్లు సభా స్వామినాథన్, దీప, శ్రీ గోపిక, అవినాష్, సుజాతలు కీలక పాత్రల్లో నటించారు. అరుల్ విన్సెంట్ కెమెరామెన్‌గా, అమ్రిష్ సంగీత దర్శకుడిగా, లారెన్స్ కిషోర్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.