తెలుగు సినిమాలకు టైటిల్(Movie Titles) కొరత ఉన్నట్టుగా ఉంది.

తెలుగు సినిమాలకు టైటిల్(Movie Titles) కొరత ఉన్నట్టుగా ఉంది. అందుకే పాత సినిమా టైటిళ్లను రిపీట్‌ చేస్తున్నారు. యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు(Pradeep machiraju) చాలా గ్యాప్‌ తర్వాత మరో సినిమా చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో టీవీ షోలు చేసుకున్నాడు. మంచి కథ దొరకగానే సినిమా చేసేశాడు. సినిమా అయితే కంప్లీట్‌ అయ్యింది.. ఏం పేరు పెడదామా అన్నదానిపై చాలా చర్చలు జరిగాయి. చివరకు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి(Akkada Ammai Ikkada Abbai) అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మొదటి సినిమా పేరు కూడా ఇదే! జబర్దస్త్‌ మొదలుకొని ఎన్నో టీవీ షోలకు రూపకల్పన చేసిన నితిన్‌ భరత్‌లు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. క్రేజీ యాంకర్‌ దీపిక పిల్లి(Deepika pilli) హీరోయిన్‌గా నటిస్తున్నది. వెన్నెల కిషోర్(Vene), సత్య, గెటప్ శ్రీను వంటి కమెడియన్లు నటించారు. సందీప్ కథ మాటలు రాసిన ఈ సినిమాకు రాడాన్ సంగీతం అందించరు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story