ఆగస్టు వచ్చిందంటే చాలు తెలుగుదేశం పార్టీ(TDP) అప్రమత్తమవుతుంటుంది.

ఆగస్టు వచ్చిందంటే చాలు తెలుగుదేశం పార్టీ(TDP) అప్రమత్తమవుతుంటుంది. ఎందుకంటే ఆ మాసంలో ఎన్నో సంక్షోభాలను చవి చూసిందా పార్టీ! తెలుగుదేశంపార్టీని స్థాపించిన ఎన్టీఆర్‌(NTR) 1983 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. కాకపోతే ఆ మరుసటి ఏడాది అంటే 1984 ఆగస్టులో అధికారాన్ని కోల్పోయారు. ఎన్టీఆర్‌ పైలెట్ అయితే తాను కో పైలెట్‌ అని చెప్పుకున్న నాదెండ్ల భాస్కర్‌రావు(Nadendla bhaskar rao) పెద్దాయనకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత నెల రోజులకు మళ్లీ ఎన్టీఆర్‌ సీఎం అయ్యారనుకోండి. మళ్లీ 1994లో ఎన్టీఆర్‌ ఒంటిచెత్తో పార్టీకి అఖండ విజయాన్ని అందించారు. 1995 ఆగస్టులో అల్లుడు చంద్రబాబు నాయుడు(Chandrababu) మామ ఎన్టీఆర్‌ను గద్దె దింపి తాను ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది కూడా వెన్నుపోటే! ఆ తర్వాత ఆగస్టు నెలలలో చిన్నా చితక సంక్షోభాలను ఎదుర్కొంది టీడీపీ. ఇక చరిత్ర చూసుకుంటే ఆగస్టు మాసం తెలుగు సినీ పరిశ్రమకు అచ్చే రాలేదని తెలుస్తోంది. 2022 ఆగస్టులో విజయ్‌ దేవరకొండ(Vijay devarkonda) హీరోగా లైగర్‌(Liger) సినిమా వచ్చింది. పూరీ జగన్నాథ్‌(Puri jagannadh) దర్శకుడు. ఆ సినిమా మీద భారీ అంచనాలు ఉండేవి. కానీ అది ఫట్‌ మంది. బయ్యర్లు, ఎగ్జిబిటర్లు బాగా నష్టపోయారు. ఇప్పటికీ ఆ నష్టాన్ని పూడ్చుకోలేకపోతున్నారు. పూరీ ఇంటి ముందు అప్పుడప్పుడు ధర్నాలు కూడా చేస్తున్నారు. 2023 ఆగస్టులో మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) నటించిన భోళాశంకర్‌ సినిమా రిలీజయ్యింది. చిరంజీవి కెరీర్‌కు ఈ సినిమా ఓ మాయని మచ్చలా మిగిలిపోయింది. మామూలు డిజాస్టర్‌ కాదు! నిర్మాత తన ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. నిర్మాత మీడియా ముందుకొచ్చి అలాంటిదేమీ లేదని చెప్పుకోవాల్సి వచ్చింది. అదే ఆగస్టు మాసంలోనే వరుణ్‌ తేజ్‌ నటించిన గాండీవధారి అర్జున్‌ సినిమా విడుదలయ్యింది. ఫలితం ఏమిటో చెప్పాల్సిన పనిలేదు. ఈ ఆగస్టు మాసలో ఇండస్ట్రీకి రెండు పెద్ద షాకులు తగిలాయి. రామ్‌ పోతినేని హీరోగా, పూరీ జగన్నాధ్‌ దర్శకత్వంలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్‌ మామూలు షాక్‌ ఇవ్వలేదు. రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్‌ బచ్చన్‌ కూడా అంతే! హరీశ్‌ శంకర్‌ డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిజాస్టర్‌ అయ్యింది. ఈ లెక్కన ఆగస్టులో సినిమాలు విడుదల చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో.. టాలీవుడ్‌కు కూడా ఆగస్టు సంక్షోభాలు తప్పవేమో!

Updated On
Eha Tv

Eha Tv

Next Story