బాలికా వధు(Balika vadhu) టెలివిజన్‌ సీరియల్‌తో అశేష అభిమానులను సంపాదించుకున్న అవికా గోర్‌(avika gor) తర్వాత సినిమాల్లో అడుగుపెట్టారు.

బాలికా వధు(Balika vadhu) టెలివిజన్‌ సీరియల్‌తో అశేష అభిమానులను సంపాదించుకున్న అవికా గోర్‌(avika gor) తర్వాత సినిమాల్లో అడుగుపెట్టారు. ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అవికా గోర్‌ తర్వాత వరుసగా లక్ష్మి రాఏ మా ఇంటికి, తను నేను, రాజుగారి గది 3 వంటి సినిమాల్లో నటించారు. ఒక్క తెలుగులోనే కాదు, కన్నడ హిందీ భాషల్లో కూడా నటించిన అవికా మొత్తంగా 24 సినిమాలు చేశారు. లాస్టియర్‌ వధువు అనే వెబ్‌ సిరీస్‌లో నటించారు. లేటెస్ట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గతంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె బాడీగార్డే(Bodygaurd) ఆమెతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడట! అసలేం జరిగిదంటే ' విదేశాల్లో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరయ్యాను. కారు దిగి నడుస్తున్న సమయంలో ఎవరో వెనకనుంచి తాకినట్లు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే బాడీగార్డ్‌ మాత్రమే ఉన్నాడు. వేదిక పైకి వెళుతున్నప్పుడు కూడా అభ్యంతరకరంగా తాకాలని చూశాడు. వెంటనే చేయి పట్టుకుని ఏం చేస్తున్నారు మీరు అని నిలదీశాను. అతడు సారీ చెప్పడంతో వదిలిపెట్టాను. నాకు అప్పుడు ధైర్యం లేదు. ఉంటేనా అతడిని చితక్కొట్టేదాన్ని. ఇప్పుడు అలాంటి అనుభవం ఎదురైతే మాత్రం కచ్చితంగా తిరగబడతాను. అప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. అలా ఎవరూ ప్రవర్తించడం లేదు. ఎదుటివారు చేసే కొన్ని పనులు మనపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అది వాళ్లకు తెలియదు’ అని అవికా గోర్‌ చెప్పుకొచ్చారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story