మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi), నందమూరి బాలకృష్ణలు(Balakrishna) కలుసుకోవడం అరుదు.

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi), నందమూరి బాలకృష్ణలు(Balakrishna) కలుసుకోవడం అరుదు. కలుసుకున్న ప్రతీసారి అరమరికలు లేకుండా ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. ఇలాంటి అరుదైన సందర్భం గీత రచయిత రామజోగయ్య శాస్త్రి(Rama jogaiah) కుమారుడి వివాహ రిసెప్షన్‌లో(Marriage Reception) కనిపించింది. చిరంజీవి, బాలకృష్ణ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

చాలా రోజుల తర్వాత ఇద్దరు కలిసి ఓకే ఫంక్షన్‌లో కలిశారు. ఈ వీడియో చూసిన అభిమానులు సంబరపడుతున్నారు. సినిమాల విషయానికొస్తే చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. మరోవైపు బాలకృష్ణ ఎన్‌బీకే 109 చిత్రంతో బిజీగా ఉన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story