రామ్ పోతినేని (Ram Pothineni) 35వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నెక్ట్స్ సినిమా లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. రామ్, బోయపాటి శ్రీను (Boyapati Sreenu)కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘#BoyapatiRapo’. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

#BoyapatiRapo

BoyapatiRapo ఫస్ట్ థండర్‌లో రామ్‌ను స్మాషింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో పరిచయం చేశారు. రామ్ పోతినేని లుక్ తోపాటు విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఓపెనింగ్ లో మండ మండుతూ ఉండగా రామ్ కత్తిపట్టుకుని రావడం చూపించడం, కట్ చేస్తే బాంబ్ బ్లాస్ట్ అవ్వడం రామ్ ఫేస్ వాష్ చేసుకోవడం వంటి సీన్స్ తో ఇంట్రెస్టింగ్ కలిగేలా చూపించారు. హీరో మాస్ డైలాగ్స్‌లో హీరోయిన్ శ్రీలీల(Sreeleela)ను చూపించారు. థమన్ (Thaman S) బ్యాక్‌గ్రౌండ్ స్కోల్ ఓ రేంజ్లో ఉండటంతో బోయపాటి మాస్ అభిమానులకు ఇక పండగో.. అని చెప్పాలి. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి (Srinivasaa Chitturi) నిర్మిస్తున్నారు. ఆ మూవీ తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.