తాజాగా ఇద్దరూ దర్శకులు ఇదే చేస్తున్నారు..



తాజాగా ఇద్దరూ దర్శకులు ఇదే చేస్తున్నారు.. పైగా వాళ్లు గురు శిష్యులు.. స్క్రీన్‌ను గ్లామర్‌తో నింపేయడంలో సిద్ధ హస్తులు.. ఆ రెండు సినిమాలకు హీరోయిన్స్ అందాలే పెట్టుబడి..! ఒక్కో పాట విడుదలవుతుంటే.. గ్లామర్ షో పెరిగిపోతుంది. ఇంతకీ ఏంటా సినిమాలు..?


మిస్టర్ బచ్చన్(Mr.Bachchan), డబుల్ ఇస్మార్ట్‌పై(Double Ismart) ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతూనే ఉంది. డబుల్ ఇస్మార్ట్ నిర్మాత ఛార్మి(Charmi) ఇటు రవితేజ(ravi teja), అటు హరీష్ శంకర్‌ను(Haris shankar) అన్‌ఫాలో చేయడంతో ఇష్యూ మరింత పెద్దదైంది.


రెండు సినిమాల్లోనూ హీరోయిన్స్ గ్లామర్ షో హాట్ టాపిక్‌గా మారిందిప్పుడు. ఇటు డబుల్ ఇస్మార్ట్.. అటు మిస్టర్ బచ్చన్ సినిమాల్లో హీరోయిన్స్ గ్లామర్ షో నెక్ట్స్ లెవల్‌లో ఉంది.


డబుల్ ఇస్మార్ట్ కోసం ఏ మాత్రం మొహమాటాలు లేకుండా రెచ్చిపోతుంది కావ్య తపర్(Kavya thappar). మరోవైపు తొలి సినిమా విడుదల కాకముందే.. తన గ్లామర్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు భాగ్య శ్రీ బోర్సే(Bhagyasree borse). మొత్తానికి ఈ బ్యూటీస్ కెరీర్‌కు ఈ రెండు సినిమాలు ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి.


Updated On
Eha Tv

Eha Tv

Next Story