బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి సంబంధించిన ఏర్పాట్లు హైదరాబాద్‌(Hydeabad)లోని అన్నపూర్ణ స్టూడియోస్‌(Annapurna Studios)లో ప్రారంభమైనట్లు సమాచారం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి సంబంధించిన ఏర్పాట్లు హైదరాబాద్‌(Hydeabad)లోని అన్నపూర్ణ స్టూడియోస్‌(Annapurna Studios)లో ప్రారంభమైనట్లు సమాచారం. సెట్ నిర్మాణ పనులు ఇప్పటికే మొదలై, సెప్టెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో షో సెప్టెంబర్ మొదటి వారంలో అంటే సెప్టెంబర్ 7, 2025 నుంచి ప్రారంభం కానుందని ఫిల్మ్ వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి.

ఈ సీజన్‌కు నాగార్జున అక్కినేని(Akkineni Nagarjuna) హోస్ట్‌గా కొనసాగనున్నారని, నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) లేదా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)హోస్ట్‌గా వస్తారనే పుకార్లను తోసిపుచ్చారు. గత సీజన్ 8 సీజన్‌లు కూడా ప్రేక్షకులను అలరించాయి. ఈ సారి నిర్వాహకులు ప్రముఖ సెలెబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎంపిక చేస్తూ కొత్త ట్విస్ట్‌లతో షోను ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. సాధారణ ప్రజలను ఈ సీజన్‌లో చేర్చకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో మొదటి సీజన్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. సీజన్ 8లో కొన్ని మార్పులతో మెరుగైన రేటింగ్స్ సాధించినప్పటికీ, సీజన్ 9ని మరింత డిఫరెంట్‌గా, డ్రామాతో కూడిన ఫార్మాట్‌తో తీసుకొచ్చేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. షో స్టార్ టీవీ, జియో హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. గత సీజన్‌లలో కంటెస్టెంట్‌ల ఎంపిక విషయంలో విమర్శలు రావడంతో, ఈ సారి ఎక్కువ డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. ఈ షోలో 16-19 మంది కంటెస్టెంట్‌లు పాల్గొనవచ్చని అంచనా.

Updated On
ehatv

ehatv

Next Story