✕
Ajit Khan : ఇవాళ మన హైదరాబాదీ నటుడు అజిత్ జయంతి...
By EhatvPublished on 27 Jan 2024 1:07 AM GMT
ఇవాళ బాలీవుడ్ నటుడు అజిత్ ఖాన్(Ajit Khan) జయంతి(Birth aniversary). అజిత్ ఖానా? ఆయనెవరు? అయినా ఆయన గురించి ఎందుకు చెప్పుకోవడం? అంటారేమో! అజిత్ ఖాన్ గురించి తెలియకపోతే వారు హైదరాబాదీలమని చెప్పుకునే అర్హత ఉండదు. ఆయనేమీ మూకీల కాలం నటుడు కాదు.. అమితాబ్(Amitabh bachchan), శతృఘ్నసిన్హా(Shatrughan Sinha) తదితర హీరోలకు ప్రతినాయకుడి పాత్రలు పోషించిన గొప్ప నటుడు. పాలిష్డ్ విలన్‌గా, విలక్షణ నటుడుగా పేరు పొందారు. ఆయన డైలాగ్ డెలివరీ చాలా ప్రత్యేకం.

x
ajith khan final
-
- ఇవాళ బాలీవుడ్ నటుడు అజిత్ ఖాన్(Ajit Khan) జయంతి(Birth aniversary). అజిత్ ఖానా? ఆయనెవరు? అయినా ఆయన గురించి ఎందుకు చెప్పుకోవడం? అంటారేమో! అజిత్ ఖాన్ గురించి తెలియకపోతే వారు హైదరాబాదీలమని చెప్పుకునే అర్హత ఉండదు. ఆయనేమీ మూకీల కాలం నటుడు కాదు.. అమితాబ్(Amitabh bachchan), శతృఘ్నసిన్హా(Shatrughan Sinha) తదితర హీరోలకు ప్రతినాయకుడి పాత్రలు పోషించిన గొప్ప నటుడు. పాలిష్డ్ విలన్‌గా, విలక్షణ నటుడుగా పేరు పొందారు. ఆయన డైలాగ్ డెలివరీ చాలా ప్రత్యేకం. సుమారు 200 సినిమాల్లో నటించిన అజిత్ హీరోగా, సెకండ్ హీరోగా దాదాపు 80 సినిమాల్లో నటించాడు. పక్కా హైదరాబాదీ పఠాన్. అన్నట్టు అజిత్ తెలుగు కూడా బాగా మాట్లాడేవాడు! 1922, జనవరి 27న జన్మించిన అజిత్ ఖాన్ పూర్వీకులు అఫ్గనిస్తాన్‌లోని కాందాహార్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు వలస వచ్చారు. అజిత్ తాత నిజాం సైన్యంలో చేరేందుకు గోల్కొండకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. అజిత్ తండ్రి మీర్ ఉస్మాన్ అలీఖాన్ దగ్గర వ్యక్తిగత డ్రైవర్‌గా పని చేశాడు. ఆయన నలుగురు పిల్లలలో అజిత్ ఒకడు. అజిత్ అసలు పేరు హమీద్ అలీఖాన్(Hamid Ali Khan). వరంగల్(Warangal), హనుమకొండలలో చదువుకున్న అజిత్‌కు ఉర్దూతో పాటు తెలుగు కూడా బాగా వచ్చు. వరంగల్ కాలేజీలో చదువుతున్న సమయంలోనే ఫుట్‌బాల్(Football) ఆటలో రాటుదేలాడు. దాంతో పాటు నాటకాలు వేసేవాడు.
-
- అజిత్‌కు పాఠాలు చెప్పే లెక్చరర్ బాగా ప్రోత్సాహించాడు.నీకు మంచి పర్సనాలిటీ ఉంది కాబట్టి ఆర్మీలో చేరు. అక్కడ కుదరకపోతే సినిమాల్లో చేరు అని సలహా ఇచ్చాడు. ఈ విషయం తండ్రితో చెబితే ఆయన ఆర్మీ(Army) కంటే సినిమాలే(Movies) బెటరని చెప్పాడు. బాంబేకు వెళ్లి నీ అదృష్టాన్ని పరీక్షించుకోమని చెప్పి పంపించాడు. బాంబేకు వెళ్లాడు కానీ సినిమా అవకాశాలు అంత సులభంగా దొరకలేదు. చాలా ప్రయత్నించాడు. ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ వాళ్లు తీసే డ్యాకుమెంటరీలలో నటించాడు. వారు రోజుకు మూడు నుంచి ఆరు రూపాయలు ఇచ్చేవారు. అది కూడా రోజూ షూటింగ్ ఉండేది కాదు. ఇలా చాలా కష్టాలు పడ్డాడు అజిత్. 1946లో షా ఏ మిస్ర్(Shah A Misr) అనే సినిమాలో అవకాశం వచ్చింది. అందులో హీరోయిన్గా చేసింది గీతా బోస్(Geetha Bose). ఆ తర్వాత హాతింతాయ్ సినిమాలో నటించాడు. తన రూపం, తన ప్రత్యేకమైన కంఠస్వరంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దురదృష్టమేమిటంటే రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. అటు పిమ్మట బేకసూర్ అనే సినిమాలో ఛాన్స్ వచ్చింది. అందులో హీరోయిన్ మధుబాల.
-
- ఆ సినిమాకు దర్శకత్వం వహించిన కె.అమర్నాథ్ నీ పేరు చాలా పొడుగ్గా ఉందని, చిన్నగా ఉంటే బాగుంటుందని చెప్పి పేరు మార్పుకోమన్నాడు. అప్పుడు తన పేరును అజిత్‌గా మార్చుకున్నాడు. ఆ సినిమా సూపర్‌హిట్టయ్యింది. దాంతో అజిత్ పేరును ఖాయం చేసుకున్నాడు. వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యింది. హాలకు, సికిందర్, తాన్సేన్, నాస్తిక్, బారాదరి, మోతీ మహల్, బడాభాయ్, ఢోలక్, చార్ దిల్ చార్ రాహే, మెరైన్ డ్రైవ్, ఓపేరా హౌస్ సినిమాలన్నీ అజిత్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆనాటి హీరోయిన్లు నూతన్, నర్గీస్‌లతో మినహా మిగతా పెద్ద హీరోయిన్లందరితో అజిత్ నటించాడు. మీనాకుమారి, వనమాల, ఖుర్షీద్, నళినీ జయవంత్, గీతా బాలి, సురయ్యా, కామినీ కౌశల్, నిమ్మి, బీనా రాయ్, బి.సరోజాదేవి వంటి పెద్ద కథానాయికలు అజిత్ సరసన నటించారు. మొఘల్ ఏ ఆజమ్ సినిమాలో దిలీప్ కుమార్ స్నేహితుడు దుర్జన్ సింగ్‌గా అజిత్ నటన అమోఘం. అంతకు ముందు వచ్చిన నయా దౌర్‌లో మెయిన్ హీరో దిలీప్‌కుమార్ అయితే సెకండ్ హీరో అజిత్. ఆ సినిమాలో హీరోయిన్ వైజయంతిమాలను ప్రేమిస్తాడు.
-
- అయితే ఆమె దిలీప్‌కుమార్‌ను ప్రేమించడాన్ని తట్టుకోలేక విలన్‌గా మారతాడు. చివరకు మంచివాడుగా మారతాడు. ఇన్ని షేడ్లను సినిమాలో అద్భుతంగా కనబరిచాడు అజిత్. ఆ సినిమాలోనే ఉన్న ఏ దేశ్ హై వీర్ జవానోంకా అనే పాటలో అజిత్ హావభావాలు చక్కగా ఉంటాయి. అజిత్ స్ఫూరద్రూపి అయినప్పటికీ, నటనలో ఏ వంకా లేనప్పటికీ హీరో అవకాశాలు అంతంగా మాత్రంగానే వచ్చేవి. 1966లో వచ్చిన పానిక్ ఇన్ బాగ్దాద్‌లో హీరోగా నటించిన అజిత్ మళ్లీ కథానాయకుడి పాత్రల జోలికి వెళ్లలేదు. 1966లో తాతినేని ప్రకాశ్‌రావు దర్శకత్వంలో సూరజ్ సినిమా వచ్చింది. అందులో హీరో రాజేంద్రకుమార్. ఆ సినిమా అప్పుడే అజిత్ క్లోజ్ ఫ్రెండ్ అయిన రాజేంద్రకుమార్ ఓ సలహా ఇచ్చాడు. ఎంతసేపూ హీరోల వేషాల కోసం తన్లాడే బదులు విలన్‌గా మారితే కెరీర్ బ్రహ్మండంగా ఉంటుంది కదా! ఆలోచించు అని చెప్పాడు. ఇదేదో బాగానే ఉందనిపించింది అజిత్‌కు. వెంటనే విలన్ పాత్రలకు షిప్టయ్యాడు. ఆ తర్వాత 30 ఏళ్ల పాటు తిరుగులేని ప్రతినాయకుడయ్యాడు. 1995లో దేవానంద్ తీసిన గ్యాంగ్స్టర్లో చివరిసారిగా నటించిన అజిత్ సినిమాలకు దూరమయ్యాడు.
-
- అజిత్ డైలాగ్ మాడ్యులేషన్ భిన్నంగా ఉండేది. అదే అతడికి ప్లస్సయింది. గాంభీర్యంతో కూడిన అతడి కంఠస్వరం విలన్‌గా రాణించడానికి దోహదపడింది. ప్రతినాయకుడి పాత్రలను కూడా చాలా హుందాగా పోషించాడు. ఖరీదైన సూట్లు వేసుకునేవాడు. పైపు కాలుస్తూ కాలు మీద కాలు వేసుకుని కూర్చునేవాడే కానీ నేరాలు ఘోరాలు చేసేవాడు కాదు. అవన్నీ తన దగ్గర ఉండేవారితో చేయించేవాడు. రేపులు గట్రాల జోలికి వెళ్లేవాడు కాదు. గొంతు చించేసుకుని పెద్ద పెద్ద డైలాగులేమీ చెప్పవాడు కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే హీరోతో సరిసమాన స్థాయిలోనే కనిపించేవాడు. సలీంఖాన్ వేషాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అతడిని బాగా ప్రోత్సహించాడు. తన నటిస్తున్న కబ్లీఖాన్ సినిమాలో తన తమ్ముడి వేషాన్ని ఇప్పించాడు. ఆ తర్వాత సలీం ఖాన్ జావేద్ అఖ్తర్‌తో కలిశాడు.
-
- సలీం-జావేద్ జోడి ఎన్ని సంచనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సలీం-జావేద్ జంజీర్ సినిమా కోసం పని చేస్తున్నప్పుడు అజిత్ పాత్రను ప్రత్యేకంగా మలిచారు. అతడి కోసం ప్రత్యేకమైన డైలాగులు రాశారు. ఆ సినిమాలో అమితాబ్‌బచ్చన్‌కు ఎంత పేరు వచ్చిందో అజిత్‌కు కూడా అంతే పేరు వచ్చింది. అదే ఏడాది వచ్చిన యాదోం కీ బారాత్ సినిమాకు కూడా సలీం-జావేద్ పని చేశారు. అందులోనూ అజిత్ పాత్రను గొప్పగా మలిచారు. జంజీర్, యాదోం కీ బారాత్ సినిమాలు సూపర్‌హిట్ కావడంతో అజిత్‌కు తిరుగులేకుండా పోయింది. టాప్ హీరోలందరితో నటించాడు. 1985లో అజిత్‌కు గుండెపోటు వచ్చింది. అ తర్వాత సినిమాలు వదిలేసి హైదరాబాద్‌కు వచ్చేశాడు. అయితే జాకీ షరాఫ్, కరిష్మా కపూర్లు నటించిన పోలీస్ ఆఫీసర్ సినిమా కోసం అజిత్‌ను అడిగారు. సినిమాల మీద ఉన్న మోజుతో కాదనలేకపోయాడు. తర్వాత సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్, సంజయ్ దత్ల సినిమాల్లో కూడా నటించాడు. మిమిక్రీ కళాకారులకు అజిత్ వాయిస్ ఓ పరీక్షవంటిది.
-
- అజిత్ వాయిస్‌ను అనుకరిస్తే చాలు మిమిక్రీలో డాక్టరేట్ చేసినట్టే! మోనా డార్లింగ్ అనేది అజిత్ ట్రేడ్‌మార్క్ డైలాగు. అజిత్ చేతిలో ఏదో ఒక పుస్తకం ఉండేది. పుస్తకాలంటే అజిత్‌కు ఎంతో ఇష్టం. ఉర్దూ షాయరీలను అలవోకగా చెప్పేవాడు. 1951లో ఫ్రెంచ్ అమ్మాయి గ్వేన్మాంటేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయిదేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. తర్వాత తండ్రి చెప్పినందుకు షహీదా అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. అజిత్-షహీదాలకు షాహిద్ అలీ ఖాన్, జహీద్ అలీఖాన్, అబిద్ అలీఖాన్ అనే ముగ్గురు కొడుకులు. షహీదా అర్ధాంతరంగా చనిపోవడంతో సారా అనే యువతిని జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. అమ్జాజ్ఖాన్ తడ్రి జయంత్ ప్రోద్బలంతోనే ఈ పెళ్లి చేసుకున్నాడు. మూడో భార్య ద్వారా అజిత్‌కు షెహజాద్ ఖాన్, అర్బాజ్ ఖాన్ పుట్టారు. తను బాంబేలో ఉంటున్నా కుటుంబాన్నిమాత్రం హైదరాబాద్‌లోనే ఉంచాడు. తన సంతానం సినిమాల్లోకి రావడం అజిత్‌కు ఇష్టం లేకపోయినా షెహజాద్, అర్బాజ్లో సినిమాల్లో కాలుపెట్టి మళ్లీ వెనక్కి వచ్చేశారు. అందాజ్ అప్నా అప్నా సినిమాలో షెహజాద్ ఖాన్ నటించాడు. తన తండ్రిని అనుకరిస్తూ డైలాగులు చెప్పాడు. 1998, అక్టోబర్ 22న అజిత్‌కు మరోసారి గుండెపోటు వచ్చింది. ఈసారి మాత్రం చావు నుంచి బయటపడలేకపోయాడు.

Ehatv
Next Story