సుమారు 14 ఏళ్ల తర్వాత ఆమె రీ ఎంట్రీకి రెడీ అయ్యారు. తమిళ్‌లో సూపర్ అనే కార్యక్రమం ద్వారా బుల్లితెరలోకి ఎంట్రీ ఇచ్చిన మాళవిక ఇప్పుడు బిగ్‌స్క్రీన్‌పై అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. విజయ్ టీవీలో ప్రసారమవుతున్న ఊ సొల్రియా ఊ ఊ సొల్రియా' అనే కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

Malavika Re-Entry
శ్రీకాంత్(Srikanth), వడ్డే నవీన్(Vadde Naveen) హీరోలుగా వచ్చిన సూపర్‌హిట్ సినిమా చాలాబాగుంది(Chala Bagundhi) గుర్తుండే ఉంటుంది. అందులో శ్రీకాంత్‌కు జోడిగా మాళవిక(Malavika) నటించారు. ఆ తర్వాత చంద్రముఖి(Chandramukhi), ఆంజనేయులు వంటి సినిమాల్లో నటించారు. తమిళంలో మాత్రం మాళవిక చాలా పాపులర్. చిత్తిరం పేసుదడి సినిమాలో వాలమీనుక్కమ్(Valameenukkam) అనే పాటలో మాళవిక డాన్స్ బాగా ఫేమస్ అయ్యింది. ఆ పాటను భాషాభేదాలు లేకుండా అందరూ ఇష్టపడ్డారు. 1999లో అజిత్(Ajit) హీరోగా వచ్చిన ఉన్నైతేడా సినిమాతో మాళవిక తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ సినిమా విజయవంతం కావడంతో ఆమెను అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ విధంగా తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషలలో మాళవిక నటించారు. అయిదేళ్ల పాటు హీరోయిన్‌గా కొనసాగిన మాళవికకు తర్వాత అవకాశాలు తగ్గాయి. అందుకు కారణం ఆమెపై వివాదాస్పదన నటి అని ముద్రపడటమే. ఆ కారణంగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను కూడ వేయాల్సి వచ్చింది. 2007లో సుమేష్ మీనన్(Sumesh Menon) అనే వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఇన్నేళ్ల తర్వాత ఆమె సోషల్ మీడియాతో ఫ్యాన్స్‌కు దగ్గరయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామరస్ ఫోటోలను పోస్టు చేస్తున్నారు. మళ్లీ సినిమాలలో నటించడానికి సిద్ధమేనన్న హింట్ ఇస్తున్నారు. సుమారు 14 ఏళ్ల తర్వాత ఆమె రీ ఎంట్రీకి రెడీ అయ్యారు. తమిళ్‌లో సూపర్ అనే కార్యక్రమం ద్వారా బుల్లితెరలోకి ఎంట్రీ ఇచ్చిన మాళవిక ఇప్పుడు బిగ్‌స్క్రీన్‌పై అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. విజయ్ టీవీలో ప్రసారమవుతున్న ఊ సొల్రియా ఊ ఊ సొల్రియా' అనే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. త్వరలోనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో రీ ఎంట్రీ అయ్యే అవకాశం లేకపోలేదు.
