మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) చిన్న కూతురు శ్రీజ(srija) మాజీ భర్త శిరీష్ భరద్వాజ్(sirish Baradhwaj) (39) అనారోగ్యంతో మృతి చెందారు.

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) చిన్న కూతురు శ్రీజ(srija) మాజీ భర్త శిరీష్ భరద్వాజ్(sirish Baradhwaj) (39) అనారోగ్యంతో మృతి చెందారు. కొంత కాలంగా శిరీష్‌ భరద్వాజ్‌ అనారోగ్యంతో ఉన్నారు. ఆయన లంగ్స్ క్యాన్సర్‌తో(Lung cancer) బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరజు మృతి చెందారు. 2007లో శ్రీజను శిరీష్‌ భరద్వాజ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చిరంజీవి కుటుంబానికి తెలియకుండా ఆర్య సమాజ్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి కూతురు కావడంతో అప్పట్లో ఈ వివాహం పెద్ద సంచలనంగా మారింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు రావడం, అదనపు కట్నం కోసం శిరీష్‌ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని 2012లో శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2014లో విడిపోవటం జరిగింది. వీరిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది. ప్రస్తుతం శ్రీజ దగ్గర ఉంటుంది. శ్రీజతో విడిపోయిన తర్వాత 2019లో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ విహనను శిరీష్‌ భరద్వాజ్‌ వివాహం చేసుకున్నారు. అటు శ్రీజ.. కళ్యాణ్ దేవ్‌ అనే వ్యక్తిని రెండో వివాహాం చేసుకుంది. కళ్యాణ్ దేవ్‌తో శ్రీజ మరో బిడ్డకు జన్మనిచ్చింది. కొంత కాలంగా శిరీష్‌ భరద్వాజ్‌ అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన లంగ్స్ డ్యామేజ్ కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొంత సమయం క్రితం మృతి చెందారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story