టాలీవుడ్‌ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ షేక్‌ జానీ బాషా(Jani master) ప్రస్తుతం నార్సింగి పోలీసుల(Narsingh police) అదుపులో ఉన్నాడు.

టాలీవుడ్‌ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ షేక్‌ జానీ బాషా(Jani master) ప్రస్తుతం నార్సింగి పోలీసుల(Narsingh police) అదుపులో ఉన్నాడు. లైంగిక ఆరోపణలు(Sexual assault) ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌ను స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (SOT) పోలీసులు గోవా నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. తర్వాత రహస్య ప్రదేశంలో అతడిని విచారిస్తున్నారు. నాలుగైదు రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్‌ను గోవాలోని(Goa) ఓ లాడ్జిలో ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి, తర్వాత ట్రాన్సిట్‌ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం జానీ మాస్టర్‌ నగర శివారులోని ఓ ఫాంహౌజ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. రహస్య ప్రదేశంలో ఉంచి అతడిని పోలీసులు విచారిస్తున్నారు. గోవా కోర్టు ఆదేశాల మేరకు.. ఈ రోజు జానీ మాస్టర్‌ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరుచనున్నారు. జానీ మాస్టర్‌ సహయకురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అతడిపై ఐపీసీ 376(2), 506, 323 సెక్షన్లతో పాటు పోక్సో(POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story