సందీప్ రెడ్డి వంగా, దీపికా పదుకొణె మధ్య వివాదం చెలరేగింది.

సందీప్ రెడ్డి వంగా, దీపికా పదుకొణె మధ్య వివాదం చెలరేగింది. ప్రధానంగా సందీప్ (Sandeep Reddy Vanga)దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ సినిమా (Spirit Movie)కథ లీక్ అయినట్లు ఆరోపణల చుట్టూ తిరుగుతోంది. ఈ సినిమాలో మొదట దీపికా పదుకొణెను హీరోయిన్‌గా అనుకున్నారు, కానీ ఆమె అనేక షరతులు పెట్టడం, స్క్రిప్ట్‌లోని కొన్ని అసభ్య సన్నివేశాలు, లిప్ కిస్సులు(Lip Kisses), సెక్స్ సీన్లు (Sex Scenes )ఉన్నందునే అసౌకర్యంగా భావించడం వల్ల ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి. ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రీని ఎంపిక చేశారు.

ఈ నేపథ్యంలో, సందీప్ రెడ్డి వంగా తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేస్తూ, తాను ఒక నటికి 100% నమ్మకంతో కథ చెప్పానని, కానీ ఆమె లేదా ఆమె PR బృందం ఆ కథను లీక్ చేసే ప్రయత్నం చేసిందని, ఇది అనధికారిక నాన్-డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉల్లంఘన అని ఆరోపించారు. ఈ లీక్‌లు త్రిప్తి డిమ్రీని దెబ్బతీసేందుకు, ఆమెను విమర్శించేందుకు ఉద్దేశించినవని, ఇది "డర్టీ PR గేమ్స్"లో భాగమని సందీప్ విమర్శించారు. ఈ విషయంలో దీపికా పేరును స్పష్టంగా ప్రస్తావించకపోయినా, ఈ ఆరోపణలు ఆమెను ఉద్దేశించినవేనని సోషల్ మీడియాలో చర్చ జరిగింది.

దీపికా(Deepika Padukone ) లేదా ఆమె బృందం నుంచి ఈ ఆరోపణలపై స్పష్టమైన సమాధానం రాలేదు, కానీ ఆమె తప్పుకోవడానికి విభేదాలు, షెడ్యూల్ సమస్యలు లేదా స్క్రిప్ట్‌లోని కంటెంట్ కారణమని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ సినిమా స్పిరిట్‌. ఈ సినిమా అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ తర్వాత భారీ అంచనాలను రీచ్‌ అయింది. మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికాను అనుకున్నారు. సందీప్ ఆమెకు కథను వివరించాడని, కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి. దీపికా రోజుకు ఆరు గంటలు మాత్రమే షూటింగ్‌కు అందుబాటులో ఉంటానని, అదనపు రోజులకు అధిక పారితోషికం డిమాండ్ చేసిందని, ఇవి పెద్ద బడ్జెట్ సినిమాకు అసాధ్యమని బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. దీపికా స్థానంలో యానిమల్ నటి త్రిప్తి డిమ్రీని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ప్రముఖ వెబ్‌సైట్ పింక్‌విల్లాలో స్పిరిట్ కథకు సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి, దీనిపై సందీప్ వ్యంగ్యంగా స్పందిస్తూ, "ఆ వార్త రాసిన వ్యక్తి నా ఆఫీస్‌లో నా పక్కనే కూర్చుని కథ విన్నట్లున్నాడు" అని పోస్ట్ చేశారు. ఈ లీక్‌లు త్రిప్తి డిమ్రీని దెబ్బతీసేందుకు, ఆమె పాత్రను విమర్శించేందుకు ఉద్దేశించినవని.. “ఇదేనా మీ ఫెమినిజం? ఒక యంగ్ నటిని కిందకు లాగడం, నా కథను లీక్ చేయడం?” అని వ్యాఖ్యానించారు. “సినిమా నా ప్రాణం, మీరు కథను లీక్ చేసినా నా కథలోని విలువ తగ్గదు” అని, “మొత్తం కథను లీక్ చేసినా నాకు పోయేదేమీ లేదు” అని ధీమాగా చెప్పారు.

ఈ వివాదంలో నటి తమన్నా భాటియా దీపికాకు పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో దీపికా మాట్లాడిన ఒక రీల్‌కు తమన్నా లైక్ చేసింది, ఇందులో దీపికా మహిళలపై లైంగిక వివక్ష, అధిక పనిగంటల ఒత్తిడి గురించి మాట్లాడింది. ఏది ఏమైనా ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ehatv

ehatv

Next Story