తెలుగులో హారర్‌ సినిమాలు(Horror movies) తక్కువే! ఇప్పుడొస్తున్న సినిమాల్లో కామెడీ పాలు ఎక్కువ, హారర్‌ కంటెంట్‌ తక్కువగా ఉంటోంది.

తెలుగులో హారర్‌ సినిమాలు(Horror movies) తక్కువే! ఇప్పుడొస్తున్న సినిమాల్లో కామెడీ పాలు ఎక్కువ, హారర్‌ కంటెంట్‌ తక్కువగా ఉంటోంది. కానీ ఈ మొనోటామిని బ్రేక్‌ చేసిన సినిమా మా ఊరి పొలిమేర! ఈ సినిమాకు విపరీమైన క్రేజ్‌ వచ్చింది. నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అయిన డిస్నీ హాట్‌స్టార్‌లో(Hotstar) ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సినిమాకు భారీ స్పందన రావడంతో దీనికి సీక్వెల్‌గా పొలిమేర 2ను తీశారు దర్శక నిర్మాతలు. అయితే పొలిమేర 2(Polimer 2) మాత్రం థియేటర్లలో వచ్చింది. ఇది కూడా సూపర్‌ హిట్టయ్యింది. కేవలం మూడు కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా 15 కోట్ల రూపాయలను సంపాదించింది. పొలిమేర 2కి కూడా సీక్వెల్ ఉంటుదనే హింట్‌తో సినిమాను ముగించాడు దర్శకుడు. పొలిమేర 3 కూడా ఉంటుందని ఆ సినిమా ప్రమోషన్స్ సమయం నిర్మాతలు చెప్పారు. చెప్పినట్టుగానే పొలిమేర 3 తీశారు. ఇప్పుడు గ్లింప్స్ విడుదల చేశారు. పొలిమేర 2 క్లైమాక్స్‌లో నటుడు బబ్లూ పృథ్వీరాజ్ చెప్పే లెట్స్ బిగిన్ ది షో అనే డైలాగ్‌తో పొలిమేర 3 గ్లింప్స్ రిలీజ్ ప్రారంభం అయి క్యూరియాసిటీ పెంచింది. పాన్‌ ఇండియా స్థాయిలో తీసిన మూడో పార్ట్‌కు కూడా డాక్టర్‌ అనిల్‌ విశ్వనాథే దర్శకత్వం వహించాడు. వంశీ నందిపాటి నిర్మాతగా, భోగేంద్ర గుప్తా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story