దర్శకుడు క్రిష్‌కు(Dirctor krish jagarlamudi) పెళ్లయ్యింది.

దర్శకుడు క్రిష్‌కు(Dirctor krish jagarlamudi) పెళ్లయ్యింది. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ ప్రీతి చల్లా(Preety charla) మెడలో ఆయన మూడు ముళ్లు వేశారు. చాలా సింపుల్‌గా జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన వారు, ఇండస్ట్రీలో క్రిష్‌కు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. క్రిష్‌కు ఇది రెండో పెళ్లి. ఇంతకు ముందు కూడా క్రిష్‌ ఓ డాక్టర్‌నే పెళ్లి చేసుకున్నారు. అయితే వారి వైవాహిక బంధం చాన్నాళ్లు ఉండలేదు. 2018లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి క్రిష్‌ ఒంటరిగానే ఉంటున్నారు. ఇప్పుడు ప్రీతి అనే డాక్టర్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె గైనకాలజిస్ట్‌. పెళ్లి ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ప్రీతి టీమ్‌.. వారికి శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. స్టార్‌ హీరోయిన్‌ అనుష్క- క్రిష్‌ ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ఆ మధ్యన తెగ వార్తలు వచ్చాయి. అయితే ఇవి కేవలం వదంతులు మాత్రమేనని అనుష్క ప్రకటించడంతో పుకార్లు ఆగిపోయాయి. మొదటి సినిమా గమ్యంతోనే అందరి దృష్టిలో పడ్డారు క్రిష్‌. ఆ తర్వాత వేదం, కంచె , కొండపొలం వంటి సినిమాలతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ప్రస్తుతం ఘాటి (Ghaati) సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అనుష్క (Anushka) ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమది. కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) చిత్రానికి సంబంధించి క్రిష్‌ కొంత భాగం దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

Updated On
Eha Tv

Eha Tv

Next Story