కొండా సురేఖ(Konda surekha) అసభ్యకరమైన వ్యాఖ్యలపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Ram gopal varma) ఎక్స్‌ వేదికగా మరో ట్వీట్ చేశారు.

కొండా సురేఖ(Konda surekha) అసభ్యకరమైన వ్యాఖ్యలపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Ram gopal varma) ఎక్స్‌ వేదికగా మరో ట్వీట్ చేశారు. సినిమా ఇండస్ట్రీ ఆమెకు మరచిపోలేని గుణపాఠం నేర్పాలని వర్మ కోరారు. 'కొండా సురేఖ సమంతకి(Samantha) క్షమాపణ చెప్పటమెంటి??? అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని(Nagarjuna), నాగ చైతన్యని(Nagachaithaya).. ఒక మామగారు, ఒక భర్త, ఒక కోడలిని , ఒక భార్యను, వాళ్లకి సంబంధించిన ఒక ఆస్తిని కాపాడుకోవడానికి ఫోర్స్‌తో పంపించడానికి ట్రై చేస్తే, తను విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్పటం కన్నా ఘోరమైన ఇన్సల్ట్ నేను నా జీవితంలో వినలేదు.. ఇది సమంతను అవమానించడం ఎలా అయింది??? వాళ్లిద్దరి కోసమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీ లోవుండే అందరి కోసం ఈ విషయాన్ని

చాలా సీరియస్‌గా తీసుకుని మరచిపోలేని గుణపాఠం నేర్పాలి' అంటూ రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్ చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story