డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు(Ram gopal varma) హైకోర్టులో(AP High court) చుక్కెదురైంది

డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు(Ram gopal varma) హైకోర్టులో(AP High court) చుక్కెదురైంది. సినీ దర్శకుడు వర్మ తనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో పిటిషన్ పై విచారణ జరిగింది. పిటిషనర్‌కి నోటీసులు జారీ అరెస్ట్(Arrest) నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ న్యాయవాది చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్(Bail petetion) వేసుకోవాలని స్పష్టం చేసింది. పోలీసులు నోటీసులు ఇచ్చారన్న పిటిషన్ న్యాయవాది. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో సీఎం చంద్రంబాబు(CM chandrababu), డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan), నారా లోకేష్(Nara lokesh), నారా బ్రాహ్మణిలపై(Nara bramhini) అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎం.రామలింగం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటి యాక్ట్‌ కింద రాంగోపాల్‌వర్మపై నవంబర్‌ 10న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వ్యూహం సినిమా.. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్లతోనే రాజకీయ దూమారం చెలరేగింది. ఈ సినిమాపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విడుదలను ఆపాలని నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు

Updated On
Eha Tv

Eha Tv

Next Story