ప్రస్తుతం ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu arjun) హవా నడుస్తోంది.

ప్రస్తుతం ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu arjun) హవా నడుస్తోంది. పుష్ప(Pushpa) సినిమాతో బన్నీ నేషనల్ స్టార్‌(National star) అయ్యారు. అల్లు అర్జున్‌ క్రేజ్‌ ఖండాంతరాలు దాటిపోయింది. మరికొద్ది రోజుల్లో పుష్పకు సీక్వెల్‌(Pushpa 2) రాబోతున్నది. సుకుమార్‌(Sukumar) ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పుష్ప 2: ది రూల్‌ సినిమా డిసెంబర్‌ 5వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ ఊపందుకున్నాయి. త్వరలోనే దేశంలోని ప్రధాన నగరాలైన పాట్నా, కలకత్తా, చెన్నై, కొచ్చి, బెంగళూరు, ముంబాయ్‌, హైదరాబాద్‌లలో ఈ సినిమా ప్రమోషన్స్‌ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పుష్ప 2- ది రూల్‌ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ని(Trailer launch) ఈ నెల 17న బీహార్‌ రాజధాని పాట్నాలో వైభవంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ని మూవీ మేకర్స్‌ సోమవారం విడుదల చేశారు. అదిరిపోయేట్టుగా ఉన్న పోస్టర్‌ ట్రైలర్‌పై ఆసక్తిని పెంచింది. పోస్టర్‌లో గన్‌ భుజాన వేసుకొని మాసివ్‌ లుక్‌తో స్టయిల్‌గా నడిచి వస్తున్న అల్లు అర్జున్‌ను చూడొచ్చు. ఆల్‌మోస్టార్‌ సినిమా చిత్రీకరణ పూర్తయ్యిందని, ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ సినిమాలో కూడా రష్మిక మందన్నానే(Rashmika mandanna) హీరోయిన్‌గా నటిస్తున్నారు. సెకండ్‌ పార్ట్‌లో ఫహాద్‌ ఫాజిల్‌(Fahad fassil) పాత్ర ఎక్కువగా ఉంటుందని వినికిడి. మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ కలిసి ఈ సినిమాను నిర్మించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story