నటి సమంతపై(Samantha) దర్శక, రచయిత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌(Trivikram srinivas) పొడగ్తల వర్షం కురిపించాడు.

నటి సమంతపై(Samantha) దర్శక, రచయిత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌(Trivikram srinivas) పొడగ్తల వర్షం కురిపించాడు. తమిళం, తెలుగు, మలయాళం.. ఇలా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ ఒకే విధమైన అభిమానగణం ఉన్న నటులలో రజనీకాంత్‌(Rajinikanth) తర్వాత సమంత మాత్రమేనని త్రివిక్రమ్‌ అన్నారు. అది ఆమెపై ఉన్న ప్రేమతో చెబుతున్న మాట కాదన్నారు. ఆలియాభట్‌(Alia bhatt) ప్రధాన పాత్రలో రూపొందిన జిగ్రా(Jigra) సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో త్రివిక్రమ్‌ ఈ మాట అన్నారు. ఏ మాయ చేసావె సినిమా నుంచే సమంత హీరో అని, ఆమెకు వేరే శక్తి అక్కర్లేదని, తానే ఓ శక్తి అని త్రివిక్రమ్‌ ప్రశంసించారు. 'సమంత.. మీరు ముంబయిలోనే ఉండకుండా అప్పుడప్పుడు హైదరాబాద్‌కు రండి. మీరు సినిమాలు చేయడం లేదని మేం కథలు రాయడం లేదు. మీరు నటిస్తానంటే మేం రాస్తాం. ‘అత్తారింటికి దారేది’లాగా.. సమంత కోసం హైదరాబాద్‌కు రావడానికి దారేది అనాలేమో. సమంత రావాలని ట్రోల్ చేయాలి' అని త్రివిక్రమ్‌ అన్నారు.

సమంత - త్రివిక్రమ్‌ కాంబోలు హిట్ సినిమాలు వచ్చాయి. అత్తారింటికి దారేది(Attarintiki Daredi), అ..ఆ(A..Aa), సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి(s/o Satyamurthi) సినిమాలు విజయవంతమయ్యాయి. సమంత చేయదేమో అన్న భయంతో తాను ఆమె కోసం పాత్రలు రాయడం లేదని త్రివిక్రమ్ అనగానే, రాయండి అని సమంత సైగ చేశారు. రాస్తా అని త్రివిక్రమ్ అన్నారు. ఇదంతా ఆ సినిమా వేడుకలో ఆకర్షణగా మారింది. అంటే సమంత త్వరలో త్రివిక్రమ్‌ సినిమాలో నటిస్తారన్నమాట! ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ఓ పాన్‌ ఇండియా లెవల్లో ఓ మైథలాజికల్‌ టచ్‌ ఉన్న సినిమాను త్రివిక్రమ్‌ చేయబోతున్నారు. అందులో సమంత నటించడం గ్యారంటీ అని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story